Home /News /telangana /

TS GOVERNOR TAMILISAI AT DELHI TO MEET AMIT SHAH AND PM MODI AMID TUSSLE WITH TRS CM KCR MKS

Telangana Governor: అమిత్ షాతో తమిళిసై భేటీ.. KCR తీరుపై ఫిర్యాదు?.. సీఎం ఢిల్లీలో ఉండగానే..

అమిత్ షాతో తమిళిసై(పాత ఫొటో)

అమిత్ షాతో తమిళిసై(పాత ఫొటో)

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా పిలుపుమేరకే ఆమె హస్తిన వచ్చినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ తీరు, టీఆర్ఎస్ సర్కారుపై కేంద్రానికి గవర్నర్ ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి, కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారుకు ప్రత్యక్షంగా పోరు జరుగుతోన్న వేళ.. స్వయంగా సీఎం కేసీఆర్ హస్తినలో మకాం వేసిన సమయాన.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ బుధవారం నాడు కేంద్రం పెద్దలను కలుస్తారు. హోం మంత్రి అమిత్ షా పిలుపుమేరకే గవర్నర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో భేటీ పూర్తయిన గంటల వ్యవధిలోనే హోం మంత్రి గవర్నర్ ను కలవనుండటం గమనార్హం. తెలంగాణలో కొంతకాలంగా ముఖ్యమంత్రి-గవర్నర్ మధ్య విబేధాలు నెలకొన్న దరిమిలా కేసీఆర్ తీరుపై తమిళిసై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని చర్చ జరుగుతోంది..

తెలంగాణలో గవర్నర్, సీఎం కేసీఆర్‌ మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్‌ అడ్డాగా మారిందని, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో గవర్నర్‌ అడ్డుతగులుతున్నారని, గవర్నర్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారనీ కేసీఆర్ సర్కారు ఆరోపిస్తున్నది. మరోవైపు గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను ప్రభుత్వం గౌరవించడం లేదని, పలు సందర్భాల్లో అవమానాలు భరించాల్సి వచ్చిందని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

CM KCR: పన్ను పీకించుకొని కేసీఆర్ తిరుగుటపా! -ఢిల్లీ వరి దీక్షకు సీఎం పక్కాగా వెళతారా?


మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం లభించకపోవడం, గవర్నర్ ప్రసంగం లేకుండానే కేసీఆర్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం, యాదాద్రి పర్యటనలోనూ గవర్నర్ ప్రోటోకాల్ ఉల్లంఘన.. తదితర ఘటనలు వరుసగా చోటుచేసుకోగా, బడ్జెట్ సమావేశాల్లో సర్కారు తీరుపై గవర్నర్ బాహాటంగానే విమర్శలు చేశారు. తాజాగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను ఆహ్వానించినా ఎవరూ హాజరవలేదు.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!


రాజ్‌భవన్‌ వ్యవహారాలతో ప్రభుత్వ యంత్రాంగం అంటిముట్టనట్టు వ్యవహరిస్తోందని గవర్నర్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళిసై ఢిల్లీలో పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్‌ షాతో భేటీలో ఆమె ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు వీటిపై నివేదికలనూ సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:

Tags: Amit Shah, Bjp, CM KCR, Delhi, Governor Tamilisai, Tamilisai Soundararajan, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు