TS Constable Result 2019: తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

news18-telugu
Updated: September 25, 2019, 12:59 AM IST
TS Constable Result 2019: తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో పోలీస్  కానిస్టేబుల్  నియామక ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 17,156 పోస్టుల్లో 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు ఎంకియ్యారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల వివరాలను TSLPRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.   వ్యక్తిగత లాగిన్ ద్వారా ఫలితాల వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అక్టోబరు 1 సాయంత్రం 5 గంటలలోపు వరకు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. ఇందుకు జనరల్, బిసి  అభ్యర్థులు రూ.2000 సర్వీసు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

కాగా, కానిస్టేబుల్ పోస్టులకు గత ఏడాది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ద్వారా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలకోసం అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు  మంగళవారంరాత్రి ఫలితాలను విడుదల చేశారు.
First published: September 24, 2019, 11:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading