Home /News /telangana /

TS CONGRESS CONDUCTS RALLY TO PURCHASE PADDY IN THE STATE VRY

TS Congress : వరిపై కాంగ్రెస్... రాష్ట్రానికి వ్యతిరేకంగా ర్యాలీ.. టీఆర్ఎస్, బీజేపీలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాడ్డాయి...

కాంగ్రెస్ ర్యాలీ

కాంగ్రెస్ ర్యాలీ

TS Congress : ఓ వైపు కేంద్రం వరి ధాన్యం కోనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసిఆర్ తోపాటు ఆపార్టీ ప్రజాప్రతినిధులు మహాధర్నా కొనసాగిస్తూంటే.. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీ చేపట్టింది.

ఇంకా చదవండి ...
    ఓ వైపు కేంద్రం వరి ధాన్యం కోనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసిఆర్ తోపాటు ఆపార్టీ ప్రజాప్రతినిధులు మహాధర్నా కొనసాగిస్తూంటే.. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో భాగంగా రేవంత్ రెడ్డితోపాటు పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు కంచె వేసి అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి..

    ధాన్యం కొనుగోలులో ఓవైపు కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంటే... మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ ఆందోళన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు రైతులతో ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఇప్పుడే కదిలిరా పేరుతో కార్యక్రమాలను తలపెట్టింది.

    ఇది చదవండి  : ఇందిరాపార్క్ మహాధర్నాలో సీఎం కేసీఆర్.. ఇది ఆరంభం మాత్రమే..


    ఈ ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్క‌తోపాటు పలువురు నేతలు పాల్గోన్నారు.. కాగా వరిధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఆందోళనకు గురి చేస్తున్నాయని .. వరి కొనుగోలులో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే ఆపార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు పక్కన పెట్టి. వరి ధాన్యాంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటీ పరిస్థితులు ఎప్పుడు ఎదురు కాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇరు పార్టీలు అధికారంలో ఉండి ధర్నాలు చేయడం పై ఆయన ప్రశ్నించారు. వెంటనే రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గోన్నారు. అసెంబ్లీ ప్రాంగణం నుండి వ్యవసాయ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. కాగా కమిషనరేట్ కార్యలయం వద్దకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నేతలను మాత్రమే కార్యాలయంలోకి అహ్వానిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderbad, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు