హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పట్లో లేనట్లే.. మారిన ముహూర్తం..! కారణమిదే..

CM KCR: కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పట్లో లేనట్లే.. మారిన ముహూర్తం..! కారణమిదే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Telangana: పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ఖరారు చేసి.. ఎన్నికల సంఘంతోనే చర్చలు జరిపి.. ఆ తర్వాత దసరాకు పార్టీని ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ ఇంకా తుది దశకు రానట్లు తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. చాలా రోజుల నుంచే ఆ వ్యూహాల్లో ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది నేతలను ఆయన కలిశారు. బీజేపీ వ్యతిరేక శక్తులనంతా ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కొత్త జాతీయ పార్టీ కూడా పెట్టబోతున్నారు. ఐతే కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడు? అనే దానిపైనే క్లారిటీ లేదు. అన్నీ కుదిరితే.. దసరా పండగ రోజే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. దసరాకు కొత్త పార్టీ ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు మహూర్తం మారినట్లుగా తెలుస్తోంది. దసరాకు కాకుండా... మరో రెండు నెలలు ఆలస్యంగా.. డిసెంబరులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ షాక్.. కేసీఆర్ ప్రకటనతో అన్ని నోటిఫికేషన్లకు బిగ్ బ్రేక్?

  జాతీయ పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా, విధి విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ఖరారు చేసి.. ఎన్నికల సంఘంతోనే చర్చలు జరిపి.. ఆ తర్వాత దసరాకు పార్టీని ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ ఇంకా తుది దశకు రానట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీకి సంబంధించి.. అంతా సిద్ధం చేసుకున్న తర్వాత.. డిసెంబరులో పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సైతం ఇంకా ప్రారంభించలేదని సమాచారం. జాతీయ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసే తీర్మానం ప్రతిని కూడా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ అంశంపైనా ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది.

  కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ దూకుడు పెరుగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతు ఎజెండాతోనే దేశ రాజకీయాల్లో వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటితో పాటు దళిత, గిరిజనుల అంశాన్ని కూడా ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. దళిత బంధు, త్వరలో తీసుకురాబోయే గిరిజన బంధు పథకాలను కూడా హైలైట్ చేయాలని యోచిస్తున్నారు. కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత.. యూపీలో దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత మహారాష్ట్రలో రైతులతో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఐతే ఈ దసరాకే జాతీయ పార్టీ వస్తుందని భావించిన టీఆర్ఎస్ వర్గాలు.. ఇప్పుడా ప్రకటన డిసెంబరుకు వాయిదా పడిందని వార్తలు వస్తుండడంతో.. కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Telangana, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు