హోమ్ /వార్తలు /తెలంగాణ /

Somesh Kumar: సీఎస్ సోమేశ్‌కుమార్‌కు మాతృవియోగం - CM KCR సంతాపం

Somesh Kumar: సీఎస్ సోమేశ్‌కుమార్‌కు మాతృవియోగం - CM KCR సంతాపం

తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్ అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ లో కన్నుమూశారు. సీఎస్ సోమేశ్ కుమార్ కుటుంబానికి సీఎం కేసీఆర్, మంత్రులు సానుభూతి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కుటుంబంలో విషాదం నెలకొంది. సోమేశ్‌కుమార్‌ తల్లి మీనాక్షి సింగ్‌ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొడుకుతోపాటే హైదరాబాద్ లో ఉంటోన్న మీనాక్షి.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మూడు వారాలుగా ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.

చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. సీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సీఎస్‌ను ఫోన్లో పరామర్శించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. సీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Sunil Kanugolu: డైలమాలో ప్రశాంత్ కిషోర్.. శిష్యుడు సునీల్ కనుగోలు దూకుడు.. కాంగ్రెస్‌లో చేరిక

సోమేశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్ పార్థివదేహానికి బిహార్‌లోని సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి తరలించనున్నారు. మంత్రులతోపాటు పలు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు సోమేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

First published:

Tags: Bihar, CM KCR, Cs somesh kumar, Somesh kumar, Telangana

ఉత్తమ కథలు