TS cabinet meeting : ఆదివారం మరోసారి రాష్ట్ర కేబినెట్ మీటింగ్...

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

TS cabinet meeting :ఆదివారం మరోసారి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెళ్లడించాయి..

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆగస్టు ఒకటిన మంత్రి సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.కాగా జులైలో రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా..జూలై 13న కొనసాగిన సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది.ఈ సమావేశాల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు.

    అయితే.. మరో ఆగస్టు 1న మరోసారి క్యాబినెట్ సమావేశం కొనసాగనుంది. అయితే ఈ సమావేశంలో కూడా ఇదే   దళిత బంధు అమలుతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలు చర్చలకు రానున్నట్టు సమాచారం.

    కాగా ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి 500 కోట్ల రూపాయలను నేడు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి గత కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకున్నా...దాని అమలుపై  రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఎమ్మెల్యేకు నిరసనలు ఎదురవుతున్నాయి.. ఆయా నియోజకవర్గాల్లో కూడా  అమలు చేయాలని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలోనే ఆదివారం జరగబోయో సమావేశంలో మరోసారి ఈ స్కీం పై చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే చేనేతలకు బీమాపై సీఎం  కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే దానిపై కూడ కూలంకుశంగా చర్చినట్టు తెలుస్తంది,. హుజూరాబాద్‌లో ఎస్సీల తర్వాత బీసీ వర్గాల్లో వీరి శాతం ఎక్కువగా ఉండడంతో ఆవైపుగా సీఎం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు చేనేత బంధుపై నేడు సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సైతం త్వరలో ఈ స్కీం అమలు అవుతుందని స్పష్థం చేశారు.
    Published by:yveerash yveerash
    First published: