TS BJP CHIEF BANDI SANJAY ARRESTED BY POLICE AMID ANTY 317 GO AGITATION DEEKSHA YATRA MKS
Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్.. బీజేపీ ఆఫీసు బద్దలుకొట్టి.. స్టేషన్లోనే దీక్ష..
బండి సంజయ్ అరెస్ట్ దృశ్యాలు
కరీంనగర్ లోని బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎంపీని మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, పోలీస్ స్టేషన్ లోనే సంజయ్ జాగరణ దీక్ష కొనసాగిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన జీవో 317కు వ్యతిరేకంగా ఎంపీ బండి కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నాడు జాగరణ దీక్షకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుచెప్పినా వెనక్కి తగ్గని సంజయ్.. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించారు. అక్కడికి కాషాయ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పుతుందనే అంచనాతో పోలీసులు.. బీజేపీ ఆఫీసు తాళాలు పగులగొట్టిమరీ బండిని అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎంపీని మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే, పోలీస్ స్టేషన్ లోనే సంజయ్ జాగరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అరెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు బండి సంజయ్. నల్గొండలో సీఎం కేసీఆర్ సభకు అనుమతించిన ఇదే పోలీసులు కరీంనగర్ లో మాత్రం తన దీక్షకు అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 317తో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీరని నష్టం వాటిల్లుతోందని, సొంత జిల్లాలో కూడా ఉద్యోగులు పరాయి వాళ్లుగా ఉండాల్సి వస్తుందన్నారు. జీవోను సవరించిన తర్వాతే అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని బండి డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కరీంనగర్ లో తలపెట్టిన జాగరణ దీక్షకు సంబంధించి ఆదివారం రాత్రి వరకు 170 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ సత్యనారాయణ చెప్పారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు పెట్టామని, పోలీసుల విధులకు ఆటం కలిగించినందుకు కూడా సెక్షన్లు జోడించామని, పోలీసులపై ఎదురుదాడి చేసినందుకు ఎంపీ సంజయ్ పైనా కేసు నమోదు చేశఆమని సీపీ చెప్పారు. బండి సంజయ్ అరెస్టును హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు ఖండించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.