Home /News /telangana /

TRY TO BANK ROBBERY BUT FAILED AT TELANGANA GRAMEENA BANK IN UTNOOR OF ADILABAD VRY

Adilabad : బ్యాంకు చోరికి విఫలయత్నం.. లాకర్ తెరుచుకోకపోవడంతో....!

బ్యాంకులో దొంగలు

బ్యాంకులో దొంగలు

Adilabad : ఆదిలాబాద్‌లో దొంగలు బ్యాంకు చోరికి విఫలయత్నం చేశారు.. మంగళవారం రాత్రి బ్యాంకు దోపిడికి వచ్చిన దొంగలు గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లినా... లాకర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు

    అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లోని షాంపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. బ్యాంక్ వెనక భాగం లో ఉన్న గోడను పగుల గొట్టి బ్యాంక్ లో లోపలికి వెళ్ళిన దుండగులు బ్యాంక్ లోని లాకర్ ను గ్యాస్ కట్టర్ తో పగుల గొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఉదయం బ్యాంక్ కు వచ్చిన సిబ్బంది దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీసులకు సమచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాల తో విచారణ చేపట్టారు.

    ఈ దొంగ తనం విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అరా తీశారు. అనంతరం బ్యాంకు వెనుక భాగం గోడకు రంధ్రం చేసి లోనికి చొరబడి గ్యాస్ కట్టర్ ఉపయోగించి విఫలమయ్యారని, కాగా ఇంతకుముందు జగిత్యాల జిల్లాలో ఇలాగే జరిగిందని ఇప్పుడు దొంగతనానికి పాల్పడింది వారే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.. కాగా దొంగతనానికి యత్నించి వారిని పట్టుకునేందుకు క్లూస్ టీములను పిలిపించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Bank news

    తదుపరి వార్తలు