ట్రంప్ భారత్ రాక...పులకించిపోయిన తెలంగాణ వీరాభిమాని

Donald Trump India Visit | తన దైవం డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రావడం పట్ల తాను గర్విస్తున్నట్లు తెలంగాణకు చెందిన ఆయన వీరాభిమాని పేర్కొన్నాడు.

news18-telugu
Updated: February 24, 2020, 4:22 PM IST
ట్రంప్ భారత్ రాక...పులకించిపోయిన తెలంగాణ వీరాభిమాని
ట్రంప్ విగ్రహానికి పూజలు చేస్తున్న వీరాభిమాని(Photo: ANI)
  • Share this:
తాను దేవుడిగా పూజించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌కు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నట్లు ఆయన వీరాభిమాని బుస్సా కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది ట్రంప్ కోసం జనగమ జిల్లాలో ఆరు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నాడు ట్రంప్ అభిమాని కృష్ణ. ట్రంప్‌లో భారత్‌లో రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం అహ్మదాబాద్ చేరుకోవడంపై ఆయన స్పందించారు. ట్రంప్‌ను తాను దేవుడితో సమానంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను దేవుడిగా భావించే ట్రంప్ భారత పర్యటనకు రావడం అమిత సంతోషాన్ని కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.  త్వరలోనే తాను డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకుంటానన్న విశ్వాసం వ్యక్తంచేశారు. తీవ్రవాదంపై పోరులో ట్రంప్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు