హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR : మరోసారి ధాన్యం పోరు.. పార్టీ నేతలతో మీటింగ్.. ఢిల్లీకి సీఎం.

CM KCR : మరోసారి ధాన్యం పోరు.. పార్టీ నేతలతో మీటింగ్.. ఢిల్లీకి సీఎం.

CM KCR : మరోసారి కేంద్రపై పోరుకు తెలంగాణ సర్కార్ సన్నద్దమవుతోంది. ధాన్యం కొనుగోలుపై తీవ్ర ఒత్తిడి తెచ్చెందుకు సీఎం కేసీఆర్ నేడు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కార్యచరణ ప్రకటించి ఢిల్లీకి వెళ్లనున్నారు.

  తెలంగాణ సర్కార్ మరోసారి ఢిల్లీపై పోరుకు సిద్దమైంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించడంతో కేంద్రంపై పోరాటానికి రంగం సిద్దం చేస్తోంది. ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పోటాపోటి పోరు కొనసాగుతుండగా మరోసారి ధాన్యం కొనుగోలును సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు చేయమని చెబుతున్న కేంద్రంపై ఎలాగైన ప్రెషర్ పెట్టి తమ బలాన్ని నిరూపించుకునేందుకు ఆయన రాజకీయ కార్యచరణ చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు.

  ఈ సమావేశం ఉదయం 12 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభం కానుంది.. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లతో రైతుబంధు సమితుల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గోననున్నారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై తీసుకురావాల్సి ఒత్తిడి, కార్యచరణ రూపోందించనున్నారు. స్థానికంగా పోరు కొనసాగించేందుకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ నేతలు చేయాల్సిన అంశాలను సీఎం వివరించి వారికి ఆదేశాలు జారీ చేయనున్నారు.

  Bodhan: బోధన్​లో ఉద్రిక్తత.. శివాజీ విగ్రహం ప్రతిష్టాపనతో మొదలైన రచ్చ.. పరిస్థితి చేయి దాటడంతో 144 సెక్షన్​ విధింపు

  మరోవైపు సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీవెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆందోళనతో పాటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రమంత్రులను కలిసి ఒత్తిడి తేనున్నారు. అవసరమైతే పీఎం అపాయింట్‌మెంట్ తీసుకుని సమస్యను చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి పక్క ప్లాన్‌తో ఢిల్లీ వెళుతున్న సీఎం ఆయా మంత్రుల అపాయింట్‌మెంట్‌లను ముందే తీసుకుని వరి ధాన్యం కొనుగోలుతో పాటు రాష్ట్రంలో పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మూడు లేదా నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది.

  First published:

  Tags: CM KCR, Telangana

  ఉత్తమ కథలు