ఇష్టం లేకపోతే మానేయండి.. డాక్టర్లకు కేటీఆర్ క్లాస్

సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు.

news18-telugu
Updated: August 2, 2019, 5:06 PM IST
ఇష్టం లేకపోతే మానేయండి.. డాక్టర్లకు కేటీఆర్ క్లాస్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ క్లాస్ పీకారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, సీరియస్ కేసులను వైద్యులు లేని కారణంగా ఇతర ఆస్పత్రులకు పంపిస్తుండడంతో వారిపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇష్టం ఉంటే చేయండి. లేకపోతే మానేసి వెళ్లిపోండి. కొత్తవారిని తీసుకుంటాం.’ అని కేటీఆర్ క్లాస్ పీకారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి సమీప గ్రామాల నుంచి రోజుకు సుమారు 100 నుంచి 130 మంది వరకు గర్భిణులు ఔట్ పేషెంట్లుగా వస్తుంటారు. దీంతోపాటు ప్రసవాల కోసం వచ్చేవారు కూడా ఉంటారు. కానీ, అక్కడ గైనకాలజిస్టులు అందుబాటులో లేకపోవడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు సీరియస్ కేసులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నట్టు గర్భిణులు, రోగుల బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాస్తవ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం వూద్యులతో మాట్లాడారు. వెంటనే ఖాళీలను భర్తీ చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు.First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>