TRS WORKING PRESIDENT KTR LASHED OUT AT BJP ON MALLANNA POLL VRY
KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్...
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
KTR : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నేత.. క్యూ న్యూస్ మల్లన్నపై మండిపడ్డారు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం పై ఆయన అభ్యంతరం చెబుతూ...బీజేపీ అధిష్టానానికి ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్‌లో నిర్వహించిన పోల్‌పై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు నేర్పే సంస్కృతి ఇదేనా... అంటూ ప్రశ్నించారు. మీ పార్టీ నేతలకు కూడా ఇదే నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించారు.. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కుటుంబంపై ఇలాంటీ విమర్శలు చేస్తే పరిస్థితి ఏమిటని ..మీరు ఏమైనా ఆలోచించారా అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు జర్నలిజం పేరిట వ్యక్తి స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు హిమాన్షుపై పోల్ పెట్టి శరీరంపై ఒపినియన్ అడగడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని, ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందన్నారు. సోషల్ మీడియాను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు అనుకూలంగా మారాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family? https://t.co/hHlXC99r1v
కాగా ఇటివల బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ యూటూబ్ చానల్లో.. రాష్ట్ర అభివృద్దిపై ఒపినియన్ పోల్ నిర్వహించాడు.. ఆ పోల్‌లో భాగంగా రాష్ట్రంలో అభివృద్దిపై ప్రశ్నించాడు.. రాష్ట్రంలో అభివృద్ది ఎక్కడ జరిగింది అంటూ... భద్రాచలం గుడిలోనా... లేక కేటిఆర్ కొడుకు హిమాన్షు శరీరంలోనా.. అంటూ పోల్ నిర్వహించాడు.. కాగా ఆ పోలింగ్‌లో మొత్తం 73 వేల మంది పాల్గోన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం ఈ సంఘటనపై స్పందించింది. విమర్శించడానికి, కించపరచడానికి ఎలాంటీ సమస్యలు లేనప్పుడు మీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని, అలాంటప్పుడు బాద్యతయుతంగా ఉండాలని సూచించారు. ఇక ఇలాంటీ అంశాలను సోషల్ మీడియాను ఉపయోగించుకున్న వారికే అవమానం అని పేర్కోన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.