• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TRS WORKING PRESIDENT KTR FIRES ON BJP FOR THEIR COMMENTS ON CM KCR AK

Telangana: కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదు.. మండిపడ్డ కేటీఆర్

Telangana: కేసీఆర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడలేదు.. మండిపడ్డ కేటీఆర్

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: నేడు దేశంలో తెలంగాణ సగర్వంగా నిలబడిందంటే అందులో కేసీఆర్ కృష్టి ఎంతో ఉందని కేటీఆర్ అన్నారు. అలాంటి ‌కేసీఆర్‌పై ఉద్యమంలో అడ్రస్ లేని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

 • Share this:
  బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టుగా విమర్శలు చేస్తున్న బఫూన్ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని కేటీఆర్ హెచ్చరించారు. వాళ్లకంటే చీల్చి చెండాడే సత్తా తమకుందని అన్నారు. కేసీఆర్ కులబలం, మజిల్ బలం లేకుండానే ప్రయాణం ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టారని అన్నారు. రాష్ట్రం వచ్చేవరకు పోరాటం చేయకపోతే రాళ్లతో కొట్టండన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. నేడు దేశంలో తెలంగాణ సగర్వంగా నిలబడిందంటే అందులో కేసీఆర్ కృష్టి ఎంతో ఉందని గుర్తు చేశారు. అలాంటి ‌కేసీఆర్‌పై ఉద్యమంలో అడ్రస్ లేని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

  తెలంగాణకు ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలది వాట్సప్ యూనివర్సిటీ అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమీ తెలియదని ఆరోపించారు. కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఓటుకు నోటులో ఇరుక్కున్న వ్యక్తి కేసీఆర్‌పై ఇలాగే విమర్శలు చేసి చేసి ఆగమయ్యాడని అన్నారు. కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదని కేటీఆర్ అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: