హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR : సీఎం క్యాండిడేట్, అసెంబ్లీ రద్దుపై కేటీఆర్ క్లారిటీ.. జీతాల చెల్లింపుపై హాట్ కామెంట్

KTR : సీఎం క్యాండిడేట్, అసెంబ్లీ రద్దుపై కేటీఆర్ క్లారిటీ.. జీతాల చెల్లింపుపై హాట్ కామెంట్

KTR On Telangana Elections 2023

KTR On Telangana Elections 2023

శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు తెలంగాణ అప్పుల విషయంలో వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ పర్యటనకు వచ్చిన ప్రధానికి సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ .. మన్మోహన్ సింగ్ కు స్వాగతం పలకలేదు. మోదీ దేశానికి కాదు గుజరాత్ కు ప్రధానమంత్రి." అన్నారు కేటీఆర్

ఇంకా చదవండి ...

KTR : తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్.. తాజా రాజకీయ అంశాలపై రియాక్టయ్యారు. రీసెంట్ గా రిలీజైన రెండు సర్వేలు ఒకటి బీజేపీది... మరొకటి కాంగ్రెస్ పార్టీదని.. ఈ రెండు సర్వేల్లోనూ టీఆర్ఎస్ దే గెలుపని ప్రూవ్ అయిందన్నారు. అధికారం తమదని ప్రతిపక్షాలే స్పష్టం చేస్తున్నాయని చెప్పారు కేటీఆర్. ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉందంటే దానికి కారణం కేసీఆర్.. టీఆర్ఎస్ పాలన అన్నారాయన.

టీఆర్ఎస్ లో కొన్ని చోట్ల బయటపడుతున్న గొడవలే.. పార్టీ పటిష్టతకు నిదర్శనం అన్నారు కేటీఆర్. బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందనీ.. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రం అంతటా ఉన్నది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అన్న కేటీఆర్.. 90కి పైగా స్థానాలు వస్తాయని టీఆర్ఎస్ సర్వేలో తేలిందన్నారు.

2023లోనే ఎన్నికలు

మంచి పనులతో జనాన్ని మెప్పించడం బీజేపీకి తెలియదన్న కేటీఆర్.. కేసీఆర్ ఎవరికీ బెదరడు, లొంగడని చెప్పారు. తెలంగాణలో వాపును చూసి బలుపు అని కొందరు అనుకుంటున్నారని కౌంటరిచ్చారు. టీఆర్ఎస్ నుంచి కొందరు వెళ్లినా ఫరక్ పడదనీ.. కొత్తగా వచ్చేవాళ్లు ఉంటారన్న సంగతి మరిచిపోవద్దన్నారు. ఎన్నికలు మాత్రం 2023లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం ఇప్పటికే చెప్పారన్నారు.

Read Also : Revanth Reddy : కాళేశ్వరం మునిగింది.. నాలుగేండ్లు లేవదు..! రేవంత్ మరో సంచలనం

అప్పుడు మోడీ చేసిందే.. ఈనాడు కేసీఆర్ చేశారు

"మానవత్వం ఉన్న ప్రధాని అయితే వరదలు వచ్చినపుడు ముందస్తు సాయం అందించాలి. శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు తెలంగాణ అప్పుల విషయంలో వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ పర్యటనకు వచ్చిన ప్రధానికి సీఎం స్వాగతం పలకాల్సిన అవసరం లేదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ .. మన్మోహన్ సింగ్ కు స్వాగతం పలకలేదు. మోదీ దేశానికి కాదు గుజరాత్ కు ప్రధానమంత్రి." అన్నారు కేటీఆర్.

కేంద్రంతో బాగా లేమంటున్నారు, బాగా ఉన్నప్పుడు తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు కేటీఆర్. హైదరాబాద్ లో ఎవరికీ కనపడని ఫ్లైఓవర్లు కడుతున్న ప్రధానికి ధన్యవాదాలన్నారు. కేంద్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. హైదరాబాద్ వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు.

Read Also : Telangana : గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడు కాదు కేసీఆర్ వరద బాధితులను ఆదుకో: YS షర్మిల

రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ చచ్చిపోయిందన్నారు కేటీఆర్. సిరిసిల్లను చూసి రాహుల్ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అమేథీలో రాహుల్, కొడంగల్ లో రేవంత్ ఓడిపోయి.. సిరిసిల్లలో కాంగ్రెస్ ను ఎలా గెలిపిస్తారని అన్నారు.

జీతాలు లేట్ పెద్ద మ్యాటర్ కాదు

"ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. పరిస్థితులను బట్టి అలా జరుగుతుంటాయి. ఉద్యోగుల జీతాలను కేసీఆర్ పెంచిన విషయం మరిచిపోవద్దు. నా కంటే చాలా రెట్లు బాగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అసాధారణ వరదలు వచ్చి పంప్ హౌస్ ల్లోకి నీరు వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. పంప్ హౌస్ ఎందుకు మునిగిందో కేంద్రం బృందాలను పంపి అధ్యయనం చేయాలి. పోడు భూముల చట్ట సవరణకు కేంద్రం చొరవ చూపాలి. చట్ట సవరణ కోసం ఎంపీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రయత్నించాలి. గిరిజన అభ్యర్థిని రాష్ట్రపతి చేస్తామంటున్న బీజేపీ.. గిరిజనుల హక్కులను లాక్కునేలా తెస్తున్న బిల్లును అడ్డుకుంటాం" అన్నారు.

First published:

Tags: Kcr, KTR

ఉత్తమ కథలు