Telangana: అనుకున్న విధంగానే గ్రేటర్ ఎన్నికలు.. పార్టీ నేతలతో కేటీఆర్

KTR: గ్రేటర్ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విపత్తు గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపదని నేతలకు సూచించారు.

news18-telugu
Updated: October 20, 2020, 10:48 PM IST
Telangana: అనుకున్న విధంగానే గ్రేటర్ ఎన్నికలు.. పార్టీ నేతలతో కేటీఆర్
కేటీఆర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మళ్లీ మళ్లీ భారీ వర్షాలు నగర వాసులను ఇబ్బంది పెడుతుండటంతో.. నగరంలో మళ్లీ ఎప్పటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే దానిపై ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయా లేదా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే దీనిపై పార్టీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అనుకున్న విధంగానే గ్రేటర్ ఎన్నికలకు వెళదామని ఆయన నేతలకు సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ యాక్ట్ సవరణ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వరదలతో మనకు నష్టం లేదని నేతలకు సూచించారు. ప్రకృతి వైపరిత్యం మాత్రమే అని తెలిపారు. వరద సహాయంతో ప్రజలకు దగ్గరకావాలని అన్నారు. ఈ విపత్తు గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం చూపదని నేతలకు సూచించారు. రానున్న పది రోజులపాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని కేటీఆర్ సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలని ఆదేశించారు. బాధితులందరికీ సాయం అందాలనేది సీఎం ఆలోచనా విధానమని నేతలకు కేటీఆర్ వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను పర్యవేక్షించాలని సూచించారు.

ముంపునకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు గ్రేటర్‌పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు.
Published by: Kishore Akkaladevi
First published: October 20, 2020, 10:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading