Muncipal Election Result 2021 : జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌లో టీఆర్ఎస్ విజయం..వరంగల్ , ఖమ్మంలో ముందంజ

Muncipal Election Result 2021 : జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌లో టీఆర్ఎస్ విజయం..వరంగల్ , ఖమ్మంలో ముందంజ

Muncipal Election Result 2021 : మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. మొత్తం అయిదు మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటికే జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలను గెలిచుకుంది.

  • Share this:
    మిని మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. మొత్తం అయిదు మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటికే జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలను గెలిచుకుంది. కాగా వరంగల్, ఖమ్మంలో కూడ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాగా ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లలతో బీజేపీ తన ఖాతాను తెరించింది. ఆయా కార్పోరేషన్లలో మెజారిటీగా టీఆర్ఎస్ సభ్యులు ముందంజలో ఉండగా బీజేపీ మాత్రం అయిదు లేదా ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 66 డివిజన్‌లు ఉండగా..ఖమ్మం కార్పోరేషన్‌లో 60 డివిజన్‌లు ఉన్నాయి.

    కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి.

    1వ వార్డు – పి. మాధ‌వి(కాంగ్రెస్‌)
    2వ వార్డు – సి. చంద్రకళ(టీఆర్ఎస్‌)
    3వ వార్డు – కె.శ్రీనివాస్(టీఆర్ఎస్‌)
    4వ వార్డు – ఎస్. నాయక్(కాంగ్రెస్)
    5వ‌ వార్డు – జె.అనిత(కాంగ్రెస్)
    6వ వార్డు – వి.హేమ(కాంగ్రెస్‌)
    7వ వార్డు – కమ్మరి జయమ్మ(టీఆర్ఎస్‌)
    8 వార్డు – బి.లావణ్య(టీఆర్ఎస్‌)
    9వ వార్డు – ఎం. న‌ర్సింహా గౌడ్‌(కాంగ్రెస్‌)
    10వ‌ వార్డు – కరుణ(టీఆర్ఎస్‌)
    11వ‌ వార్డు – డి.ప్రసన్న ల‌త (టీఆర్ఎస్‌)
    12వ వార్డు – డి.రవీందర్(టీఆర్ఎస్‌)

    న‌కిరేక‌ల్ మున్సిపాలిటీకి జ‌రిగిన ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. మొత్తం 20 వార్డుల‌కు గాను 12 వార్డుల‌ను టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి.

    1వ వార్డు – బిక్షంరెడ్డి(స్వతంత్ర అభ్య‌ర్థి)
    2వ వార్డు – సునీల్(టీఆర్ఎస్ )
    3వ వార్డు – చింత స్వాతి త్రిమూర్తులు(టీఆర్ఎస్ )
    4వ వార్డు – గాజుల సుకన్య(కాంగ్రెస్‌)
    5వ వార్డు – వంటేపాక సోమలక్మి(LION)
    6వ వార్డు – మంతిప‌ల్లి క‌విత‌ (LION )
    7వ వార్డు – కొండ శ్రీను(టీఆర్ఎస్ )
    8వ వార్డు – పన్నాల పావని శ్రీనివాసరెడ్డి(LION)
    9వ వార్డు – చౌగోని రజిత(LION)
    10వ వార్డు – చౌగోని అఖిల(టీఆర్ఎస్ )
    11వ వార్డు – మురారిశెట్టి ఉమారాని(టీఆర్ఎస్ )
    12వ వార్డు – భానోతు వెంకన్న(టీఆర్ఎస్ )
    13వ వార్డు – పోతుల రవి(టీఆర్ఎస్ )
    14వ వార్డు – గడ్డం స్వామి(టీఆర్ఎస్ )
    15వ వార్డు – యసారపు లక్మి వెంకన్న(LION)
    16వ వార్డు – గర్షకోటి సైదులు(LION)
    17వ వార్డు – పల్లె విజయ్(LION)
    18వ వార్డు – దైద స్వప్న రవీందర్(కాంగ్రెస్‌)
    19వ వార్డు – రాచకొండ శ్రీను(టీఆర్ఎస్ )
    20వ వార్డు – చెవుగోని రాములమ్మ(టీఆర్ఎస్ )
    Published by:yveerash yveerash
    First published: