Huzurabad By Elections: టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా.. అందుకే వాళ్లతో ఇలా చేస్తున్నారా..?

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్)

Huzurabad By Elections: హుజూరాబాద్ లో గెలుపే లక్ష్యంగా కుల సంఘాలకు గులాబీ పార్టీ గాలం వేస్తుందా...? కుల సంఘాల అడిగిందే తడవుగా హామీలు ఇచ్చేస్తుందా.? దళిత బంధు ఇతర సామాజిక వర్గాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నదా... అంటే అవుననే అంటున్నారు.. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

 • Share this:
  (P. Srinivas, News18, Karimnagar)

  హుజురాబాద్ ఉప ఎన్నికను(Huzurabad By Elections) కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పైకి హుజురాబాద్ ఉప ఎన్నికలు లైట్ గా తీసుకున్నామని స్థానిక నాయకులే ఉప ఎన్నికలు చూసుకుంటారని మంత్రి కేటీఆర్ చెబుతున్నా.. గ్రౌండ్ రియాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రతిరోజు ముగ్గురికి తగ్గకుండా హుజురాబాద్ లో మంత్రులు మకాం వేస్తున్నారు. ఒక్కొక్క రోజు అయితే ఐదుగురు మంత్రులు కూడా తిరుగుతున్నారు. ఇప్పటికే సీఎం సహా పలువురు మంత్రులు హుజురాబాద్ లో పర్యటించాడు. హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, అయితే ఫోకస్ అంతా హుజురాబాద్ పైనే పెట్టారు. నియోజకవర్గం నుంచి కాలు బయట పెట్టడం లేదు కొత్త పథకాలకు ప్రారంభం నుంచి పాత పథకాల పున: ప్రారంభం వరకు అంతా హుజురాబాద్ కేంద్రంగానే గులాబీ పార్టీ అమలు చేస్తోంది.

  Etala Rajender: ఈటల పాదయాత్రకు బ్రేక్ పడటానికి కారణం అదేనా..?


  దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ లో అమలు చేశారు. ఆ ప్రభావం మిగతా కుల సంఘాల మీద పడిందని, ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లిందని, అందుకే హుజురాబాద్ లో కుల సంఘాలు అందర్నీ ప్రభుత్వం మచ్చిక చేసుకుంటుంది. నియోజకవర్గం మొత్తం రెండు లక్షల 26,000 వేల ఓటర్లు ఉన్నారు. అందులో 45,000 దళిత ఓటర్లు ఉన్నారు. ఇరవై ఒక్క వేల దళిత కుటుంబాల్లో సగం మంది ఖాతాలోకి దళిత బంధు జమ అయినాయి. ఆ ప్రభావం ఇతర కులాల మీద పడకుండా టిఆర్ఎస్ జాగ్రత్త తీసుకుంటుంది.

  అందుకే నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో యాదవులకు గొర్రెల పంపిణీ అమలు చేస్తుంది. భవనాలు కట్టుకునేందుకు స్థలం తో పాటు నిధులు కూడా ఇస్తుంది. పద్మశాలి, నాయి బ్రాహ్మణ, గౌడ, రెడ్డి, కాపు, వైశ్యులు, సామాజిక వర్గాలతో ప్రతిరోజు హరీష్ రావు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్ సామాజికవర్గంమైన ముదిరాజ్ కులం పైన ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని కులాలకు ఏదో ఒకటి చేస్తున్నారు.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  గత నెల రోజులుగా హరీష్ రావు చేస్తున్న కార్యక్రమాలన్నీ ఇవే. అయితే కేంద్రం తరఫున ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో తెలపాలని మంత్రి హరీష్ రావు బీజేపీ ని టార్గెట్ చేస్తు మాట్లాడుతున్నారు . ఇక ఈటెల రాజేందర్ తన పాదయాత్ర తర్వాత వరుసగా కుల సంఘాలతో భేటీ అయి టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెలరేగుతున్నాడు. ఇక హుజరాబాద్ లో అమలవుతున్న ప్రతీ పథకాన్ని తన వల్లనేనని కౌంటర్ విసురుతున్నాడు ఈటెల రాజేందర్.

  Telangana Dalit Bandhu: లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు డబ్బులు జమ.. క్రెడిట్ కాని వారికి..


  మంత్రి హరీష్ రావు పైన, మండల నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేల పైన, తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టిఆర్ఎస్ వ్యూహ రచన చేస్తోంది. కులాల ప్రాతిపాదికన ఓటర్లకు గాలం వేస్తూ.. అడిగినవి అన్నీ వరాలు ఇస్తుంది.
  Published by:Veera Babu
  First published: