Siddipeta Muncipality: సిద్దిపేట గడ్డపై రెపరెపలాడిన గులాబీ జెండా.. 36 వార్డులను కైవసం చేసుకున్న కారు..

హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Siddipeta Muncipality: మంత్రి హరీశ్ రావు ఇలాకాలో గులాబీ రెపరెపలాడింది. సిద్దిపేట మున్సిపాలిటీ పీఠంను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. దీంతో గులాబీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.

  • Share this:
    తెలంగాణలో  మినీ పోరుకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగ్గా వాటి ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో పూర్తి ఆధిక్యంలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. సిద్దిపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని ఓట‌ర్లంతా టీఆర్ఎస్‌ను ఆశీర్వ‌దించి, ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు ప‌ట్టం క‌ట్టారు. మొత్తం 43 వార్డుల‌కు గానూ, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఒక వార్డులో బీజేపీ గెల‌వ‌గా, మిగ‌తా ఐదు వార్డుల్లో స్వతంత్రులు, ఒక స్థానంలో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. ఇక‌ ఈ మున్సిపల్ ఎన్నికల్లో 67 శాతం ఓట్లు పోల్ కాగా, గత మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 4 శాతం ఓటింగ్ తగ్గింది. ఇందులో 43 వార్డుల్లో 17 వ వార్డు బీజేపీ సొంతం చేసుకోగా , 20 వ వార్డు స్వాతంత్య్ర అభ్యర్థి రియాజ్ హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 35, 36, 42, 43 స్థానాల్లో స్వతంత్య్ర అభ్యర్థులు గెలుపొందగా 29 వ వార్డు నుంచి ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు.

    దీనిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెర‌వ‌లేదు. టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులు క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేదు. గులాబీ అభ్య‌ర్థులు మంచి మెజార్టీతో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 43 వార్డులు ఉండ‌గా, టీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో విజ‌యం సాధించింది.
    Published by:Veera Babu
    First published: