పండగ వేళ టీఆర్ఎస్‌కు అదిరిపోయే గిఫ్ట్.. 2 ఎకరాల్లో కారు ముగ్గు

కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

news18-telugu
Updated: January 14, 2020, 8:23 PM IST
పండగ వేళ టీఆర్ఎస్‌కు అదిరిపోయే గిఫ్ట్.. 2 ఎకరాల్లో కారు ముగ్గు
2 ఎకరాల్లో కారు గుర్తు
  • Share this:
తెలుగు ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. పతంగుల రెపరెపలు..ఎడ్ల పందేలు, కోళ్ల పందేలతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో పట్టణాల్లో మరింత సందడి పెరిగింది. సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేసే మహిళలు.. ఎన్నికల వేళ వెరైటీ ముగ్గులు వేస్తున్నారు. ముగ్గుల్లో తమ అభిమాన పార్టీల రంగులు, గుర్తులను జోడించి అభిమానం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు 2 ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు వేశారు.

సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కారు గుర్తు ముగ్గును వీక్షించడానికి పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. ఈ ముగ్గును వేసి మహిళా కార్యకర్తలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వారిని స్థానిక టిఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు.

First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>