Home /News /telangana /

TRS SENIOR LEADER VINOD KUMAR UNHAPPY ON CENTRAL FINANCIAL PACKAGES AK

కేంద్ర ఆర్థిక ప్యాకేజీలపై టీఆర్ఎస్ నేత అసంతృప్తి

వినోద్ కుమార్ (ఫైల్ ఫోటో)

వినోద్ కుమార్ (ఫైల్ ఫోటో)

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీలు చాలా నిరుత్సాహ పరచాయని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.

    కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌, టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీలు చాలా నిరుత్సాహ పరచాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని బ్యాంకులు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నాయన్న వినోద్ కుమార్... ఇక అవి ప్రజలకు ఏం సాయం చేస్తాయని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ప్రకటన ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ-2 సఫలం అయ్యేలా లేదని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు.

    రానున్న 3-4 ఏళ్ల దాకా రెంటల్‌ అకామడేషన్‌ సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. నాబార్డు రీ ఫైనాన్స్‌ స్కీంలు కొత్త సీసాలో పాత సారా చందంగా ఉన్నాయని విమర్శించారు. కాంపా నిధులు ఏ మేరకు సాయ పడతాయని వినోద్‌ కుమార్‌ ప్రశ్నించారు. కేంద్ర వైఖరి చూస్తుంటే ప్లేయింగ్‌ టు గ్యాలరీ లాగా ఉందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Atma Nirbhar Bharat Abhiyan, Nirmala sitharaman, Telangana, Trs, Vinod Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు