Home /News /telangana /

TRS SENIOR LEADER THUMMALA NAGESWARA RAO MEETS MINISTER KTR IN PRAGATHAI BHAWAN KNOW WHAT THEY DISCUSSED SK

Thummala Nageswara Rao: మంత్రి కేటీఆర్‌తో తుమ్మల కీలక భేటీ.. హామీ లభించిందా? ఆ ప్రచారానికి తెరపడినట్లేనా?

తుమ్మల, మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

తుమ్మల, మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

Tummala meets minister KTR: తన అనుచరులు, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు.. త్వరలోనే పార్టీని వీడడం ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయన మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంకా చదవండి ...
    ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో బలమైన నేతగా తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కు పేరుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగానూ పనిచేశారు. అలాంటి తుమ్మల.. చాలా కాలంగా టీఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. సీఎం కేసీఆర్ (CM KCR) ఆయన్ను లైట్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. కేసీఆర్ తీరుపై తుమ్మల కూడా అసంతృప్తిగా ఉన్నారని.. ఈ క్రమంలోనే ఆయన పార్టని వీడేందుకు సిద్ధమయ్యారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటన్నింటికీ చెక్ పెట్టేలా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సడెన్‌ ప్రగతి భవన్‌కు వెళ్లారు. మంగళవారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌ (Tummala Meets Minister KTR) తో ఆయన భేటీ అయ్యారు. దాదాపు గంట సమయం పాటు పలు అంశాలపై చర్చించారు.

    Telangana: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. తగిన సమయంలో రాజకీయంగా మంచి అవకాశం వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు భరోసా ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాల సమచాారం. ఇక టీఆర్ఎస్ కొత్త రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కూడా మంగళవారం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోనూ ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై మంత్రి కేటీఆర్ చర్చించినట్లుగా సమాచారం. ఇద్దరు ఖమ్మం జిల్లా నేలతో వేర్వేరేగా భేటీ కావడం.. అది కూడా పార్టీ బలోపేతంపై చర్చిచడం కూడా.. టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.



    Telangana: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. 2016లో పాలేరు ఎమ్మోల్యే వెంటకరెడ్డి మరణించడంతో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు తుమ్మల. అంతేకాదు నాటి ప్రభుత్వంలో రోడ్లు,భవనాలశాఖ మంత్రిగానూ పనిచేశారు. ఐతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పటి నుంచీ తుమ్మల నాగేశ్వరరావుకు ప్రాధాన్యత తగ్గింది. ఆయన కూడా దూరం దూరంగానే ఉంటున్నారు.

    CM KCR : గజ్వేల్‌కు కేసీఆర్‌ గుడ్‌బై? -బీజేపీపై అనూహ్య వ్యూహం -కేటీఆర్‌కు జాక్‌పాట్?

    ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ని కలవలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తనను పట్టించుకోవడం లేదని తుమ్మల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు సందర్భాల్లో అన్నారు. అంతేకాదు ఖమ్మం జిల్లాకు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ పదవులు ఇచ్చినా.. తనకు అవకాశం దక్కనందుకు ఆయన బాధపడ్డారని తెలిసింది. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా గెలిచిన తర్వాత.. ఖమ్మం జిల్లా నేతలు ఇటీవల సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిశారు. ఆ బృందంలోనూ తుమ్మల లేరు. తన అనుచరులు, కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన.. త్వరలోనే పార్టీని వీడడం ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ.. తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Hyderabad, KTR, Telangana, Tummala nageshwara rao

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు