హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona positive to TRS MLA: మరో టీఆర్ఎస్​ సీనియర్​ నేతకి కరోనా పాజిటివ్​.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నాయకుడు

Corona positive to TRS MLA: మరో టీఆర్ఎస్​ సీనియర్​ నేతకి కరోనా పాజిటివ్​.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నాయకుడు

పోచారం శ్రీనివాస్​ రెడ్డి (ఫైల్​)

పోచారం శ్రీనివాస్​ రెడ్డి (ఫైల్​)

తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ఉండటం కలకలం రేపుతోంది.

తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ఉండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో సీనియర్​ టీఆర్​ఎస్​ నేతకు కరోనా పాజిటివ్గా (Corona positive to TRS MLA) తేలింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Telangana State Assembly Speaker Pocharam Srinivas Reddy)కి మరోసారి కరోనా వైరస్‌ సోకింది. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌ (Home Isolation)లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

ఢిల్లీతో మొదలు..

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందం (Ministers)లో టీఆర్​ఎస్​ నేతలకు కరోనా సోకింది. తొలుత ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా (Corona positive to TRS MLA) బారిన పడ్డారు. ఆ తర్వాత ఎంపీ రంజిత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత కేశవరావు కరోనా బారిన పడ్డారు.

ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 

కేవలం 1,963 కేసులు మాత్రమే..

పండుగ పూట తెలంగాణ ప్రజలకు కరోనా కేసుల విషయంలో ఊరట లభించింది. కేసులు సంఖ్య భారీగా పడిపోయింది. చాలా రోజుల తర్వాత కేసులు 2 వేల లోపు నమోదయ్యాయి. నిన్న అంటే శనివారం కేవలం 1,963 కేసులు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఈ నెల 14న 2,398 మరియు ఈ నెల 13న రాష్ట్రంలో 2700 కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,054కు చేరింది. రాష్ట్రంలో నిన్న మరో 1,620 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,07,162కు చేరింది.

జీహెచ్ఎంసీ పరిసర జిల్లాలు..

ఇంకా జీహెచ్ఎంసీ పరిసర జిల్లాలైన రంగారెడ్డిలో 168, మేడ్చల్ జిల్లాలో 150, సంగారెడ్డి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాల తర్వాత నిజామాబాద్ జిల్లాలో 44, మహబూబ్ నగర్ లో 40, సిద్దిపేటలో 34, మంచిర్యాలలో 32, ఖమ్మంలో 28 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి :

రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

First published:

Tags: Corona casess, Corona positive, Pocharam Srinivas Reddy, Telangana, TRS leaders

ఉత్తమ కథలు