హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Politics: ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత TRSకు తొలి షాక్.. త్వరలో బీజేపీలోకి ఆ కీలక నేత?

Telangana Politics: ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత TRSకు తొలి షాక్.. త్వరలో బీజేపీలోకి ఆ కీలక నేత?

సీఎం కేసీఆర్(పాత ఫొటో)

సీఎం కేసీఆర్(పాత ఫొటో)

టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత మంచి జోష్ లో ఉన్న బీజేపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజీపీ నాయకుల్లోనూ జోష్ పెరిగింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోని వస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. ఈ ఫలితాల తర్వాత వివిధ పార్టీల్లోని అసంతృప్తులు సైతం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీల్లోకి రానున్న వారం, పది రోజుల్లో భారీగా వలసలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలుకావడం, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారిక కార్యక్రమాల సంగతి అటుంచి, కనీసం పార్టీ కార్యక్రమాలలోనూ ఆయనకు ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచర వర్గం పలుమార్లు పార్టీ మారాలని ఒత్తిడి చేసినప్పటికీ ఇప్పటికైనా పార్టీ గుర్తించకపోతుందా? అన్న ఆశాభావంతో అదే పార్టీలో కొనసాగారు.

మరోవైపు తన అనుచరవర్గం చేజారకుండా ఎప్పటికప్పుడు వాళ్లతో మాట్లాడుతూ... సమావేశాలు నిర్వహించుకుంటూ రావడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా తనను పార్టీ గుర్తించకపోతుందా అన్న ఆశ ఆయనలో ఉండేది. ఆ కారణంగానే అనేక అవమానాలను అధిగమిస్తూ తన క్యాడర్ కు నచ్చజెప్తూ వచ్చారు. పార్టీ సభ్యత్వం కోసం పుస్తకాలు అందకపోవడం, ఇటీవల వనపర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభకు ఆహ్వానం రాకపోవడం వంటి కారణాలు ఆయనను మరింత బాధించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Telangana Politics: యూపీలో ఆ పని చేశాం కాబట్టే.. మళ్లీ బీజేపీకి అధికారం కట్టబెట్టారు.. తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ ప్రకటన

Telangana Politics, TRS Party, Telangana BJP, తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్, Jupally Krishna Rao, Bandi Sanjay, CM KCR
జూపల్లి కృష్ణారావు(ఫైల్ ఫొటో)

ఈ క్రమంలోనే గత మూడు నాలుగు రోజుల నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరుగుతూ అనుచరవర్గంతో చర్చలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలో చేరే అంశం కొన్నాళ్లు వాయిదా వేసుకున్నామని భావించినప్పటికీ.. అధికార పార్టీ నేతలు ఇక తనను పట్టించుకునే పరిస్థితులు కనిపించడంలేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి నేతలతో మాట్లాడిన తర్వాత ఆయన, కొంతమంది ముఖ్య అనుచరవర్గంతో కలిసి హైదరాబాద్ లో కొంతమంది ముఖ్యనేతలతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది

ఆయన చేరిక పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, గురువారం వివిధ రాష్ట్రాలకు సంబంధించి వెలువడిన ఫలితాలు సైతం బీజేపీకి అనుకూలంగా రావడంతో తప్పనిసరిగా ఆయన బీజేపీలోనే చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇందుకోసం శుక్రవారం తన అనుచరవర్గంతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. . నియోజకవర్గంలోని నాయకులతో చర్చించి త్వరలోనే తన ప్రణాళిక తెలుపుతామని జూపల్లి అనుచరులు తెలిపారు

First published:

Tags: Bjp, CM KCR, Mahabubnagar, Trs

ఉత్తమ కథలు