Home /News /telangana /

TRS REBAL CANDIDATE SARDAR RAVINDAR SING VARITY COMPAIGN IN ELECTIONS VRY

Sardar Ravinder sing : నామినేషన్ వేశాడు.. కాని ఓటర్లు.. క్యాంపులో ఉంటే ప్రచారం ఎట్లా చేసేది...?

నామినేషన్ వేస్తున్న రవీందర్ సింగ్

నామినేషన్ వేస్తున్న రవీందర్ సింగ్

Sardar Ravinder sing : ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థి పోటిలో ఉన్నాడు.. కాని ఆ అభ్యర్థి ప్రచారం చేసి తనకు ఓట్లు వేయమని అడిగేందుకు కూడా ఎవరు అందుబాటులో లేరు.. ( TRS rebal candidate Sardar Ravindar sing ) దీంతో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి మీడీయా మీద ఆధారపడ్డాడు. మీడియానే తనకు ప్రచార సాధనం అని చెబుతున్నాడు.

ఇంకా చదవండి ...
    కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటి చేస్తున్న కార్పోరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్‌కు వింత పరిస్థితి ఎదురైంది. ప్రతీష్టాత్మకంగా తాను నామీనేషన్ అయితే వేశాడు కాని, ఓట్లు వేయమని అడిగేందుకు ఓటర్లు మాత్రం అందుబాటులో లేని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. అయినా ఆయన గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నా.. అభ్యర్థుల ఓట్లను మాత్రం చాలా వినూత్న పద్దతిలో అడుగుతున్నాడు.

    కరీంనగర్ స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తోపాటు ఇటివల టీడీపీ నుండి చేరిన ఎల్‌ రమణకు అవకాశం కల్పించారు. అయితే వీరికి పోటిగా టీఆర్ఎ‌స్ పార్టీకి రాజీనామా చేసిన సర్ధార్ రవీందర్ సింగ్‌ ఇండిపెండెండ్‌గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.. ( TRS rebal candidate Sardar Ravindar sing ) మొదటి నుండి పార్టీకోసం కష్టపడిన ఉద్యమకారులకు కాదని ఇటివల పార్టీలో చేరిన వారికి అవకాశాలు ఇవ్వడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. దీంతో పాటు ఎక్కువ ఉన్న ఎంపీటీలపై దృష్టి సారించారు. తనకు మద్దతు ఇవ్వడం కోసం అటు కాంగ్రెస్,తో పాటు బీజేపీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధుల మద్దతును కూడగూట్టే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు ఆయన్ను తానే పోటిలో నిలబెట్టినట్టు ఈటల బహిరంగ లీకులే ఇచ్చాడు.

    Kishan reddy on kcr : హుజూరాబాద్ సెగ ఢిల్లీకి చేరింది.. కొడుకును సీఎం చేయడానికే.. రాద్దాంతం


    దీంతో కరీంనగర్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదిపారు. నామినేషన్ వేసిన రోజే తన పార్టీకి చెందిన ఎంపీటీసీలను క్యాంపుకు తరలించారు. నామినేషన్ తేది నుండి ఉప సంహహరణ వరకు ముందుగా ప్లాన్ చేసినా.. ( TRS rebal candidate Sardar Ravindar sing ) ఆ తర్వాత ఎన్నికల వరకు దాన్ని పొడగించారు. దీంతో నామినేషన్ వేసిన రోజునే అందరిని బస్సుల్లో తరలించారు. ఇక వారిని ఎన్నికలు జరగనున్న తేది వరకు క్యాంపుల్లోనే వారి కుటుంబ సభ్యులతో పాటు ఉంచారు.దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్‌కు ఎవరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కనబడకుండా చేశారు. మరోవైపు వారి సెల్ ఫోన్‌లు కూడా స్వీచాఫ్ చేసి ఉన్నాయి

    ..దీంతో రవీందర్ సింగ్ కనీసం సభ్యులను కలవనీయకుండా టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేయడంతో ఆయన వినూత్న ప్రచారానికి తెరతీశారు. కాంగ్రెస్ , బీజేపీ సభ్యులను కలవడంతోపాటు అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యులను మీడియా ద్వారా ఓట్లను అభ్యర్థించారు.( TRS rebal candidate Sardar Ravindar sing ) ఈ క్రమంలోనే ఆయన పెద్దపల్లిలో మీడీయాతో మాట్లాడారు. తనకు సభ్యులను కలవకుండా టీఆర్ఎస్ కుట్రలు చేసిందని అయినా ప్రస్తుతం పోటిలో ఉన్న అభ్యర్థులు ఏనాడు జై తెలంగాణ అన్న చరిత్ర లేదని అందుకే తాను గెలుస్తాననే దీమా వ్యక్తం చేశారు.( TRS rebal candidate Sardar Ravindar sing ) వాళ్లు టీఆర్ఎస్ క్యాంపులలో ఉన్నా ఓట్లు మాత్రం తనకే వేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని తాను నేరుగా చెప్పలేకపోయినా... మీడియా ద్వారానే వారిని అభ్యర్థిస్తున్నానని చెప్పారు.

    ఇక కరీంనగర్ జిల్లా మొత్తం 1324 ఓట్లు ఉన్నాయి. వీరిలో 750కి పైగా ఎంపీటీలే ఉన్నారు. మిగతా వారు మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతర సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా సర్ధార్ రవీందర్ సింగ్‌తో సంబంధాలు ఉండడంతో వారిలో మొదటి నుండి ఉన్న ఉద్యమకారులు తనకు ఓటు వేస్తారని ఆయన భావిస్తున్నారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Karimnagar, Telangana mlc election

    తదుపరి వార్తలు