ఏపీ సీఎం జగన్‌కు టీఆర్ఎస్ ఎంపీ షాక్...మండలి రద్దు నాన్సెన్స్ అంటూ కామెంట్

ఎవరైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సరిచేసేందుకు పెద్దలు సరిచేస్తారని ఆయన సూచించారు. శాసన సభ నిర్వహణా వ్యయంలో కేవలం 3 శాతం వ్యవయంతోనే మండలి నడపవచ్చని ఆయన అన్నారు. అందుకే అసలు ఖర్చు విషయమే తలెత్తదని కేకే కొట్టిపారేశారు.

news18-telugu
Updated: January 28, 2020, 2:35 PM IST
ఏపీ సీఎం జగన్‌కు టీఆర్ఎస్ ఎంపీ షాక్...మండలి రద్దు నాన్సెన్స్ అంటూ కామెంట్
సీఎం జగన్ (CM YS Jagan).
  • Share this:
ఏపీ శాసన మండలి రద్దుపై అన్ని రాజకీయ పక్షాలు స్పందిస్తున్నాయి. తాజా టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు స్పందిస్తూ...ఏపీ శాసనమండలి రద్దు అర్థరహితమని వ్యాఖ్యానించారు. కౌన్సిల్ పెద్దల సభగా కొనసాగాలాని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎన్టీఆర్ హయాంలో శాసన మండలిని రద్దుచేస్తే తాను స్వయంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి మండల నిర్వహణపై చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన తప్పుపట్టారు. మండలి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టమనడం నాన్సెన్స్ అని కేకే అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అదేమీ పెద్ద ఖర్చు కాదని కేకే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రెండో అభిప్రాయం తప్పని సారి అన్నారు.

ఎవరైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సరిచేసేందుకు పెద్దలు సరిచేస్తారని ఆయన సూచించారు. శాసన సభ నిర్వహణా వ్యయంలో కేవలం 3 శాతం వ్యవయంతోనే మండలి నడపవచ్చని ఆయన అన్నారు. అందుకే అసలు ఖర్చు విషయమే తలెత్తదని కేకే కొట్టిపారేశారు.

టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు
టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు