హోమ్ /వార్తలు /తెలంగాణ /

K Chandrashekar Rao: బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిన కేసీఆర్.. అనుకోని విధంగా..

K Chandrashekar Rao: బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చిన కేసీఆర్.. అనుకోని విధంగా..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

K Chandrashekar Rao: సాగర్‌లో కేసీఆర్ కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేయడం వల్ల ఎన్నికలకు ముందే పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ సీఎం రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. మరో రెండు రోజుల్లో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో పూర్తి పట్టు సాధించాలని ఆయన భావిస్తున్నారు. ఈ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సాగర్ బరిలో నిలిపే అభ్యర్థి సహా అన్ని అంశాల్లో ఆచితూచి వ్యవహరించిన సీఎం కేసీఆర్.. తమ రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సాగర్‌లో ఆయన బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్య విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించిన బీజేపీ.. సాగర్‌లోనూ తమ ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థి ఎంపిక సహా ప్రచారంలో ఆ పార్టీ వెనుకబడిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున జానారెడ్డి బరిలో ఉండటం కూడా బీజేపీకి సవాల్‌గా మారింది. త్రిముఖ పోటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ఢీ కొట్టడం బీజేపీకి అంత ఈజీ కాదనే ప్రచారం జరిగింది. అయితే నిన్న హాలియాలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన సీఎం కేసీఆర్.. తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన తీసుకురాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అభ్యర్థి అయిన సీనియర్ నేత జానారెడ్డిని మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేశారు.

అయితే సాగర్ సభలో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకపోవడం కూడా వ్యూహాత్మకమే అనే చర్చ జరుగుతోంది. సాగర్‌లో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదనే భావనలో ఉన్న సీఎం కేసీఆర్.. వారిని విమర్శించడం ద్వారా అనవసరంగా వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని భావించి ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

కేసీఆర్ కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేయడం వల్ల ఎన్నికలకు ముందే పోటీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈరకంగా సాగర్‌లో ఎన్నికలకు ముందే బీజేపీకి గులాబీ బాస్ కేసీఆర్ చెక్ చెప్పారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోతే.. ఈ విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించినట్టే భావించాల్సి ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

First published:

Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Telangana

ఉత్తమ కథలు