Home /News /telangana /

TRS Political Fight: ఎమ్మెల్సీ కవిత Vs మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆదిప‌త్య పోరులో ఆమె నెగ్గారా..?

TRS Political Fight: ఎమ్మెల్సీ కవిత Vs మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆదిప‌త్య పోరులో ఆమె నెగ్గారా..?

ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి

MCL Kavitha Vs Minster Prasanth Reddy: నిజమాబాద్ రాజకీయాలు మళ్లీ మలుపు తీసుకున్నాయా..? మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నట్టు వ్యవహరించిన.. ఎమ్మెల్యే కవిత-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య సఖ్యత కుదిరిందా..? ఇంతలో అంత మార్పుకు కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...
    P.Mahender,News18,Nizamabad.   TRS Political Fight:  తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) అసమ్మతి సెగలు చల్లారుతున్నాయా?  ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) vs మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minster Prasnath Reddy)మధ్య ఆదిప‌త్య పోరు పీక్ కు చేరినట్టు చేరి చల్లబడ్డాయా..?  గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవితకు దూరంగా ఉన్నా మంత్రి ఇప్పుడు ఎందుకు సన్నిహితంగా మారారు..          నిజామాబాద్ జిల్లా (Nizamabad district) వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవితకు చాలా ఆదరణ ఉంది..  సీఎం కేసీఆర్ (CM KCR) తనయ కావడంతో  ఎమ్మెల్సీ కవితకు ప్ర‌త్యేక స్థానం ఉంది.. అదే స్థాయిలో జిల్లా అభివృద్దిలో ముందుండి న‌డిపిస్తుంది..  గ‌త కొంత కాలంగా ఎమ్మేల్సీ క‌విత‌తో క‌లిసి ఏలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఇప్పుడు రూటూ మార్చారు..

    త‌న నియోజ‌కవ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను ఎమ్మేల్సీ క‌విత‌తో క‌లిసి మంత్రి ప్రారంబించ‌డం జిల్లాలో చ‌ర్య‌నీయ ఆంశంగా మారింది..   2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువ‌త క‌విత రాజ‌కీయ‌ల‌కు దూరంగా ఉన్నారు.  2020లో వ‌చ్చిన స్థానిక సంస్థాల ఎమ్మేల్సీ ఉప ఎన్నిక‌లో క‌విత ఘ‌న‌విజ‌యం సాదించారు..  అప్పటి నుంచి జిల్లాలో క్రీయ‌శీలకంగా వ్య‌వ‌హ‌రించారు.. అన్నీ  తానై చూసుకున్నారు.. దీంతో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి ఎమ్మేల్సీ క‌విత‌కు మ‌ద్య ఆదిప‌త్య పోరు పెరిగింది.

    ఇదీ చదవండి : టీఆర్ఎస్ లో అంతర్మథనం.. అంతా ఒకే.. అయినా ఎక్కడో డౌట్

    ఎమ్మేల్సీ క‌విత నిజామాబాద్ ప‌ర్య‌ట‌కు వ‌స్తే మంత్రి  వేముల హైద‌రాబాద్ లో ఉండే వారు.. ఇలా ఇద్ద‌రి మ‌ద్య గ్యాప్ నిపించింది.. మ‌రో వైపు ఎమ్మేల్సీ క‌విత మంత్రి అవుతుంద‌ని ఆప్ప‌ట్టో పుకారు ఉండేది.. దీంతో ఎమ్మేల్సీ క‌విత‌కు మంత్రి కి మ‌ద్య ఏదో జ‌రుగుతుంద‌ని పార్టీ శ్రేణులు బ‌హిరంగంగానే చ‌ర్చించుకున్నారు..  2021 న‌వంబ‌ర్ లో స్థానిక సంస్థాల ఎమ్మేల్సీగా క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు..  ఆ నాటి నుంచి ప‌రిస్థితులు మారిపోయాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మేల్సీ క‌విత కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న మంత్రి వేముల... ఇప్పుడు త‌న స్వొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌కు ఎమ్మేల్సీ క‌విత‌ను ఆహ్వానించారు.. ఎమ్మేల్సీ క‌విత‌తో క‌లిసి మంత్రి వేముల ప‌లు అభివృద్ది ప‌నుల్లో పాల్గొంటున్నారు అనే మెసేజ్ రావ‌డంతో జిల్లాలో చ‌ర్య‌నీయం ఆంశంగా మారింది..

    ఇదీ చదవండి : ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే

    తాజాగా  బీంగ‌ల్ మున్సిపాల్టి ప‌రిదిలో 33 కోట్ల రూపాయ‌ల నిదుల‌తో 21 ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు.. ప్రారంబోత్స‌వాలు చేసారు.. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మేల్సీ క‌విత చీఫ్ గెస్ట్ గా హ‌జ‌ర‌య్యారు.. దీంతో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి ఎమ్మేల్సీ క‌విత‌కు మ‌ద్య విబేదాలు తోలిగి పోయాయ‌ని పార్టీ శ్రేణులు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి..  ఏది ఏమైన జిల్లాలో ముఖ్య నేత‌లు అయినా ఎమ్మేల్సీ  క‌విత, మంత్రి ప్రశాంత్ రెడ్డికి మ‌ద్య సయోద్య కుద‌ర‌డం మంచిదే అని రాజ‌కీయ విశ్లేష‌కులు బావిస్తున్నారు..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Kalvakuntla Kavitha, Telangana, Trs, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు