Home /News /telangana /

TRS PARTY WORKING PRESIDENT AND MINISTER KTR POSTED ON TWITTER CRITICIZING PM NARENDRA MODI ON THE CENTRE STANCE ON CHINESE INTRUSIONS PRV

KTR: ఆ పని చేయలేని ప్రధానిని ఏమనాలి? కేంద్రం తీరుపై ట్విట్టర్​లో కేటీఆర్​ వ్యంగ్యాస్త్రాలు

Modi KTR

Modi KTR

పీఎం న‌రేంద్ర మోదీ (PM Narendra Modi)పై ట్విట్ట‌ర్‌లో టీఆర్ఎస్ (TRS) పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు

    ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Narendra Modi)పై ట్విట్ట‌ర్‌లో టీఆర్ఎస్ (TRS) పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నియంత్రించ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. దేశంలో చొర‌బాటుదారుల‌ను నియంత్రించ‌లేని ప్ర‌ధానిని మీరేమంటారు? ఇలాంటి ప్ర‌ధానిని ఏమ‌ని పిలుస్తార‌ని నాలుగు ఆప్ష‌న్ల‌ను కేటీఆర్ ట్వీట్ చేశారు.

    ఎ. 56”
    బి. విశ్వ‌గురు
    సి. అచ్చేదిన్ వాలే
    డి. పైన పేర్కొన్న‌వ‌న్నీ అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాలు కాబ‌ట్టి తొల‌గించ‌బ‌డ్డాయి. అని చెప్పుకొచ్చారు.  ప్రధాని ద్రవ్యోల్బణాన్ని, చొరబాటును నియంత్రించలేక పోతున్నారని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో చైనా మరో గ్రామాన్ని నిర్మించిందని. శాటిలైట్ ఫొటోలతో మీడియాలో వచ్చిన వార్తలను షేర్ చేశారు.



    కేటీఆర్ జాగ్రఫీలో వీక్?

    కాగా,  మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఓ నెటిజన్ కౌంటర్​ ఇచ్చాడు..'కేటీఆర్ గారు మీరు జాగ్రఫీలో కొంచం వీక్ అనుకుంటా. డోక్లాం ప్రాంతం భూటాన్లో ఉంది. భారతదేశంలో కాదు. పెట్రోలింగ్, సరిహద్దు భద్రతలో భూటాన్ రాయల్ ఆర్మీకి భారత సైన్యం సహాయం చేస్తుంది అనేది వేరే విషయం. దయచేసి అట్లాస్ చూడండి. అప్పుడు, అరుణాచల్ సరిహద్దులో నిర్మిస్తున్న గ్రామం చైనా లోపల ఉంది అని అర్థం అవుతుంది' అని కామెంట్ చేశారు. కాగా, 2017లో డోక్లామ్ పీఠభూమిలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ పొరుగు దేశాల మధ్య యుద్ధ భయాలను కూడా రేకెత్తించింది. భూటాన్ ఆ ప్రాంతం తమకు చెందినదని వాదించడంతో, భూటాన్ వాదనకు భారత్ మద్దతు తెలిపింది.



    కాగా, పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని, బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రి కేటీఆర్
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: China, KTR, PM Narendra Modi, Telangana Politics, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు