హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ట్వీట్... ఉద్యోగులు ప్రజలను మోసం చేస్తున్నారా?

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ట్వీట్... ఉద్యోగులు ప్రజలను మోసం చేస్తున్నారా?

TSRTC Strike 17th Day : తెలంగాణ బంద్ ఉద్ధృతంగా జరగడంతో ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇవీ వాస్తవాలు అంటూ నెటిజన్లకు సమాచారం ఇచ్చింది.

TSRTC Strike 17th Day : తెలంగాణ బంద్ ఉద్ధృతంగా జరగడంతో ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇవీ వాస్తవాలు అంటూ నెటిజన్లకు సమాచారం ఇచ్చింది.

TSRTC Strike 17th Day : తెలంగాణ బంద్ ఉద్ధృతంగా జరగడంతో ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇవీ వాస్తవాలు అంటూ నెటిజన్లకు సమాచారం ఇచ్చింది.

  TSRTC Strike 17th Day : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందనీ, వాస్తవాలు ఇవీ అంటూ టీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా ఆర్టీసీ సమ్మెపై ఓ ట్వీట్ పెట్టింది. ఇప్పటివరకూ ఈ సమ్మెపై పార్టీ ఎలాంటి స్పందనా ఇవ్వలేదు. అలాంటింది తెలంగాణ బంద్ జరగడంతో... వాస్తవాలేంటి... అసలు ఏం జరుగుతోంది అంటూ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్‌లో టీఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాలు పాయింట్ల రూపంలో ఇచ్చింది. 2009-10 నుంచీ 2013-14 వరకూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.712 కోట్ల కేటాయింపు జరగ్గా... 2014-15 నుంచీ ఇప్పటివరకూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి రూ.4,253 కోట్లు ఇచ్చినట్లు ట్వీట్‌లో తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన నిధులు 600 శాతం పెరిగితే... ఏమీ ఇవ్వలేదని ఉద్యోగులు అసత్యాలు చెబుతున్నారన్నట్లుగా ట్వీట్ చేసింది. అలాగే... తెలంగాణ వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు 67 శాతం పెరిగాయన్న టీఆర్ఎస్... చట్టవిరుద్ధమైన సమ్మె జరిపిస్తూ... కార్మికుల జీవితాలతో యూనియన్లు చెలగాటం ఆడుతున్నాయని విమర్శించింది.

  ప్రస్తుతం ఈ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానిజాలేంటో ప్రభుత్వం అధికారికంగా తెలపాలని నెటిజన్లు కోరుతున్నారు. ట్విట్టర్‌లో పెట్టిన ట్వీట్‌లో నిజమెంతో తేల్చాలని కోరుతున్నారు. మరోవైపు సమ్మె మొదలై 16 రోజులు పూర్తైనా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం, హైకోర్టు సూచనల్ని కూడా పక్కన పెట్టి, చర్చల అంశాన్ని అటకెక్కించడంతో... ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. భవిష్యత్తులో జరిపే ఆందోళనల వల్ల ప్రజలు ఇబ్బంది పడితే... దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. సోమవారం నుంచీ సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని తెలిపారు. ఆదివారం ప్రజలకు గులాబీలు ఇచ్చి... ఆర్టీసీ ప్రాముఖ్యత, అవసరాన్ని వివరిస్తామన్నారు. 23న ఉస్మానియా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభకు వెళ్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు... తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే బంద్ విజయవంతం అయ్యిందని ప్రకటించారు.

  ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వని ప్రభుత్వం... అద్దె బస్సులకు కూడా ఇవ్వాల్సిన అద్దె ఇవ్వలేదు. సెప్టెంబర్‌కి చెల్లించాల్సిన చెల్లింపులు చెల్లించలేదు. మా సంగతేంటని అద్దె బస్సుల యజమానులు అడుగుతున్నారు. సమ్మె వల్ల తమకు డబ్బులు ఆపేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో మొత్తం 10,460 బస్సులు ఉన్నాయి. వీటిలో అద్దె బస్సులు 2103 ఉన్నాయి. కొత్త బస్సులకు బదులు ప్రభుత్వం ప్రైవేట్ బస్సులకు అద్దె చెల్లిస్తూ నడిపిస్తోంది. ఒక్కో బస్సుకూ నెలకు రూ.లక్ష దాకా చెల్లిస్తోంది. ఆ లెక్కన మొత్తం రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడా మనీ చెల్లించకపోవడంతో తాము తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కుదరట్లేదని ఆపరేటర్లు చెబుతున్నారు.


  Photos : అందాల కేరళ కుట్టి అదితి మీనన్ క్యూట్ ఫొటోస్


  ఇవి కూడా చదవండి :

  భారీ చేపను నీటిలో వదిలేసిన చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు... వైరల్ వీడియో

  వీళ్లంతా యూరప్‌లో మోస్ట్ వాంటెడ్ వుమెన్... చేసిన నేరాలు ఇవీ...


  మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది... లెక్కతేల్చిన పురావస్తు తవ్వకాలు

  బీజేపీలో టీడీపీ కలిసిపోతుందా? జీవీఎల్ సంకేతాలు ఇస్తున్నారా?

  First published:

  Tags: Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు