Eetala Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించడంతో..ఆయనపై టీఆర్ఎస్ పార్టీ నేతలు మూకుమ్మడి దాడి చేశారు..ఇన్నాళ్లు మంత్రి పదవిలో ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడడం సమంజం కాదని పార్టీ నేతలు హితవు పలికారు. మరోవైపు ఆయన హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం ఖామమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన టీఆర్ఎస్ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మరో కొద్ది రోజుల్లో బిజెపిలోలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యలోనే ఆయన పార్టీ అధినేత సీఎం కేసిఆర్ వ్యవహరశైలిపై మండిపడ్డారు.. పార్టీలో అత్మాభిమానం లేదని విరుచుకుపడ్డారు..తాను ఎందుకు బయటకు రావాల్సింది వివరించారు..దీంతోపాటు సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు..మంత్రులకు,ఎమ్మెల్యేలకు కనీస విలువ లేదని దుయ్యబట్టారు.
దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈటలకు కౌంటర్ విమర్శలు చేశారు..ఆయనకు వ్యతిరేకంగా మంత్రుల గంగుల కమలాకర్‌తోపాటు మరో ఎస్సీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు రంగంలోకి దింపాడు. దీంతో వారు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వార ఈటల వ్యాఖ్యలను ఖండించారు...ఈ నేపథ్యంలోనే మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఈటల హుజురాబాద్‌లో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. అక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందని అన్నారు. ఆత్మగౌరవం పేరుతో ఈటల బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని, కారుకు ఓనర్లమని చెప్పిన ఈటల చివరకు బిజెపికి క్లీనర్ అయ్యాడని విమర్శించాడు.
ఇక మరోమంత్రి కొప్పులు ఈశ్వర్ సైతం ఈటల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు..ఏడు సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు ఉందని కాని, ఈటల అప్పటి నిర్ణయాలపై వ్యతిరేకించకుండా... ఇప్పుడు మాట్లాడడాన్ని తప్పుబట్టాడు. ఇక ఎస్సీల భూములను తీసుకోవడం ఎప్పటికైన నేరమేని అన్నారు. ఆయన ఎస్సీల భూములను కొనుగోలు చేసి తప్పు చేశాడని అన్నారు.
ఇక ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు ఆత్మగౌరవం ఉంటే.. పేదల ఆస్తులను అక్రమంగా ఆక్రమించేవారు కాదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతోమందిని సీఎం కేసిఆర్ నాయకులను చేశారని అన్నారు..ఉద్యమంలో చాలమంది వచ్చి వెళ్లారని గుర్తుచేశారు. పార్టీ బయటకు వెళ్లెటప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.