టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు కన్నుమూత.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సుదర్శన్ రావు మృతితో టీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: September 16, 2020, 11:06 AM IST
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు కన్నుమూత.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సుదర్శన్ రావు, సీఎం కేసీఆర్
  • Share this:
టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత సుదర్శన్ రావు మరణించారు. బుధవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం సుదర్శన్ కరోనా బారినపడ్డారు. గచ్చిబౌలిలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గుండోపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. సుదర్శన్ రావు మృతితో టీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్ రావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉద్యమ తొలినాళ్లలో అద్భుతంగా పని చేసిన నాయకుడని సీఎం కొనియాడారు. చిన్న వయస్సులో చనిపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ రావు మృతి పట్ల ఇతర టీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading