Home /News /telangana /

TRS PARLIAMENTARY LEADER KESAVA RAO TESTED POSITIVE FOR COVID 19 GOES THIRD TOP LEADER IN ROW MKS

covid 19 : టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్.. వైరస్ బారినపడ్డ మూడో టాప్ నేత

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొవిడ్ సోకగా, ఆయనతోపాటు ఢిల్లీలో పర్యటించిన మంత్రులు, ఎంపీలకు సైతం వైరస్ టెన్షన్ పట్టుకుంది. తాజా గా ఢిల్లీ పర్యటనకు వెళ్లినే మంత్రులు, ఎంపీల బృందంలో మరొకరికి కరోనా సోకింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ కే. కేశవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇంకా చదవండి ...
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో టాప్ నేతలు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొవిడ్ సోకగా, ఆయనతోపాటు ఢిల్లీలో పర్యటించిన మంత్రులు, ఎంపీలకు సైతం వైరస్ టెన్షన్ పట్టుకుంది. తాజా గా ఢిల్లీ పర్యటనకు వెళ్లినే మంత్రులు, ఎంపీల బృందంలో మరొకరికి కరోనా సోకింది. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఎంపీ కే. కేశవరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఆర్టీపీసీఆర్ విధానంలో ఎంపీ కేశవరావుకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో పాజిటివ్ అని తెలింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిమ్స్ వైద్యుల సలహాతో కేశవరావు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ముగ్గిరికి కరోనా పాజిటివ్ అని తెలింది. మొదట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిర్ధారణ అయింది. తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డికి తాజా గా కేశవరావుకు కరోనా నిర్ధారణ అయింది.

Cotton : తెల్లబంగారానికి అదిరిపోయే ధర.. పత్తి క్వింటాల్‌ రూ.9 వేలు.. వరి వద్దన్నందుకు భలే గిరాకీ..



తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నాటికి 100 శాతం పూర్తయింది. తెలంగాణలో వ్యాక్సిన్ పొందే అర్హత గల వారికి 100 శాతం తొలి డోసు పూర్తయినట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మాత్రం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో తాజాగా ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు.

rain alert : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే 2 రోజుల్లో ఎక్కడ కురుస్తాయంటే..



ఇక సాధారణ కేసుల విషయానికొస్తే, గడిచిన మంగళవారం నాడు 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Keshava rao, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు