Eetala Rajendar :టిఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేకనే.. డబ్బు..దొంగ ఓట్లను నమ్ముకుంది..

Eetala Rajendar :టిఆర్ఎస్‌కు గెలిచే సత్తా లేకనే.. డబ్బు..దొంగ ఓట్లను నమ్ముకుంది..

Eetala Rajendar : అధికార పార్టీ ఎన్నిక ప్రలోభాలకు గురి చేసిన హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ‌ను తిరస్కరిస్తారని ఈటల రాజేందర్ అన్నారు. గెలుపుకోసం అనేక అడ్డదారులను వాడుకుంటున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

 • Share this:
  ఎన్నికల్లో గెలవాలనే ఒకే ఒక్క ఆలోచనతోనే హుజూరాబాద్‌లో నికృష్టమైన పనులకు అధికార పార్టీకి దిగుతుందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకునే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మినహా ఏ నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ది జరిగింది..కాని మిగతా నియోజకవర్గాల్లో నిధులు రాలేదని అన్నారు. ఇక కాంట్రాక్ట్‌లు ఇచ్చి ఎక్కడా లేని విధంగా వారి నియోజకవర్గాల్లో ఇళ్లు నిర్మాణాలు చేయించుకున్నారని అన్నారు.

  వ్యక్తిగత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలని తాను గతంలోనే ప్రభుత్వాన్ని కోరానని .. అయినా ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు..ఇక ఈటలకు ఓటేస్తే..ప్రభుత్వ పథకాలు రావని బెదిరించడం పై ఆయన మండిపడ్డారు. ప్రజల పథకాలు అపడం ఎవరి తరం కాదని అన్నారు. గెలిచే సత్తా లేకనే...ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నేరుగా ప్రజల ఓట్లను గెలవలేకనే.. డబ్బుతోపాటు దోంగ ఓట్లను నమ్ముకుని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

  నియోజకవర్గంలో ప్రతి వర్గం ఈటల రాజేందర్‌ను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఒక్కో ఓటరుకు లక్ష రూపాయలు ఇచ్చినా..ఓటు వేయరని అన్నారు. ఇక అధికారుల తీరుపై కూడా...అటు డీజీపీతోపాటు సీఎస్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అధికారులు తమ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని చిన్న కారణం చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.

  ఇక పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ ఎంపీడివోపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటీ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ప్రొద్బలంతోనే మంత్రులు చేస్తున్నారని అన్నారు.
  Published by:yveerash yveerash
  First published: