స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ సభ్యులు తమ దీమాను వ్యక్తం చేస్తున్నారు... ఇన్నాళ్లు క్యాంపులకు వెళ్లిన సభ్యులు నేరుగా పోలింగ్ బూతులకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.( mlc elections in karimnagar ) ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు నేరుగా గోవా నుండి ఆయా ప్రాంతాల్లో కేటాయించిన పోలింగ్ బూతులకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆయా పోలింగ్ బూతుల వద్ద సందడి నెలకొంది.
కాగా ఇన్నాళ్లు గోవా క్యాంపులో సభ్యులతో కలిసి ఉన్న మంత్రి గంగుల కమాలాకర్ ( gangula kamalakar ) నేడు వారితో కలిసి పోలింగ్ బూత్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కీలక కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి అధిక బలం ఉన్నా... కడుపు మంటతో ఏకగ్రీవం కాకుండా కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ( mlc elections in karimnagar ) బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలు చేయమని ప్రకటించినా నామినేషన్ వేశారని అన్నారు. కాగా ఇండిపెండెంట్గా నిలబడిన రవీందర్ సింగ్ ఎవరి బలంతో పోటిలో ఉన్నాడో తెలియదని అన్నాడు.( mlc elections in karimnagar ) ఇక టీఆర్ఎస్ పార్టీకి 986 మంది సభ్యులు ఓటు వేయనున్నారని వారిలో ఓక్క ఓటు తగ్గినా తమలో క్రమశిక్షణ తగ్గినట్టేనని సవాల్ విసిరారు.
ఇక మిగిలిన ఓట్లు కూడా మీకు పడతాయా అని బీజేపీని ప్రశ్నించారు. అయితే బీజేపీకి పడిన ఓట్లకు ఈటల రాజేందర్ లేదా బండి సంజయ్ భాద్యత వహిస్తారో తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు.( gangula kamalakar ) ఇక తాము తలలు తెగినా టీఆర్ఎస్ పార్టీవైపే ఉంటామని, ఈ ఎన్నికలతో మరోసారి రాజకీయ పరిణామాలు మారనున్నాయని ఆయన తెలిపారు.
MLC elections : : కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్.. జిల్లాల్లో శశాంక్ గోయల్ పర్యవేక్షణ
కరీంనగర్ జిల్లాలో ఓటర్ల సంఖ్య 1324 కాగా ఎక్స్ అఫిషియో సభ్యులు 14 మంది ,వీరిలో కరీంనగర్ నగరపాలక సంస్థ,రామగుండం నగరపాలక సంస్థల కార్పొ రేటర్లు 109 , 15 మునిసిపాలిటీలకు చెందిన 369 కౌన్సిలర్లు , జడ్పీటీసీ సభ్యులు 70 మంది , ( mlc elections in karimnagar ) ఎంపీటీసీ సభ్యులు 762 మంది తమ ఓటు హక్కును విని యోగించుకుంటారు . మొత్తం ఓటర్లలో మహిళలే అత్యధికంగా ఉన్నారు . 743 మంది మహిళలు కాగా , 581 మంది పురుషులు ఉన్నారు.
ఇక జిల్లాలో రెండు స్థానాలకు అధికార టీఆర్ఎస్ సభ్యులు పోటిలో ఉన్నారు. వారిలో భానుప్రసాద్ రావు , ఎల్ రమణలు ఉన్నారు వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఆ పార్టీ రెబల్ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ తోపాటు ఇతర ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. కాగా రవీందర్ సింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బహిరంగంగానే మద్దతు పలికారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gangula kamalakar, Karimnagar, Mlc elections