Home /News /telangana /

TRS MUNUGODE PUBLIC RALLY ALL EYES IN CM KCR SPEECH ON MUNGODU PRAJA DEEVENA MEETING HE MAY ANNOUNCE TRS CANDIDATE SK

CM KCR: నేడు మునుగోడులో టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేస్తారా?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

TRS Munugodu Public Meeting: రేపు మునుగోడులో అమిత్ షా సభ జరగనుండడంతో దానికి ఒక్క రోజు ముందు.. భారీగా బల ప్రదర్శన చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మనుగోడు జనం తమవెంటే ఉన్నారని సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అంతా సిద్ధం చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. పోటాపోటీ బహిరంగ సభలతో ఉపఎన్నికల వేడి అప్పుడే రాజుకుంది. ఇప్పటికే మునుగోడు (Munugodu Bypoll)లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆ సభకు హాజరయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీల వంతు వచ్చింది. శనివారం టీఆర్ఎస్, ఆదివారం బీజేపీ సభలు తలపెట్టాయి. శనివారం మునుగోడులో జరగనున్న సభకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరుకానున్నారు. ఈ సభకు మనుగోడు ప్రజా దీవెన సభగా పేరు పెట్టారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల కోసం 6 చోట్ల పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు.

    రేపు మునుగోడులో అమిత్ షా (Amit Shah) సభ జరగనుండడంతో దానికి ఒక్క రోజు ముందు.. భారీగా బల ప్రదర్శన చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మనుగోడు జనం తమవెంటే ఉన్నారని సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అంతా సిద్ధం చేసింది. నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కూడా మునుగోడు సభకు హాజరుకానున్నారు. వారంతా ర్యాలీగా మునుగోడుకు వెళ్తారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

    Telangana : మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా మూడో సారి ఆయనే .. బహిరంగసభలో కేసీఆర్ ప్రకటించే ఛాన్సు

    సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ (Hyderabad) నుంచి మునుగోడుకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి.. మధ్యా హ్నం 2 గంటల సమయంలో మునుగోడులోని సభా వేదికకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలోనే వెళ్తుండడంతో.. ఆయన కాన్వాయ్ వెనక టీఆర్ఎస్ భారీ ర్యాలీ తలపెట్టింది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు రెండు వేలకుపైగా కార్లతో సీఎం కాన్వాయ్‌ను అనుసరించనున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు జీహెచ్ఎంసీ (GHMC) పరిధి నుంచే బయలుదేరుతాయి. మరో వెయ్యి వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి మార్గ మధ్యలో కలుస్తాయి. హైదరాబాద్‌ నలుమూలల నుంచి వచ్చే కార్లు, వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా పెద్ద అంబర్‌పేటకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా మునుగోడుకు వెళ్తారు. ఈ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. హైదరాబాద్, పెద్ద అంబర్‌పేట్, పోచంపల్లి ఎక్స్‌ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడు వరకు ఈ ర్యాలీ జరుగుతుంది.



    కేసీఆర్ ఏం మాట్లాడతారు?
    మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడే అవకాశముంది. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా.. మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఈ సభా వేదికగా ప్రకటించే అవకాశముంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మరోసారి టికెట్ ఖాయమైందని.. ఆయన పేరునే సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Munugode Bypoll, Munugodu By Election, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు