KCR Coupons ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

కేసీఆర్ కూపన్స్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్

యూకేలో చిక్కుకున్న ఎన్ఆర్ఐలకు సాయం చేసేందుకు కేసీఆర్ కూపన్స్‌ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సిద్ధం చేసింది.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే విభాగం ఓ కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కేసీఆర్ స్పూర్తి, కేటీఆర్ ఆదేశాల మేరకు... ఇటీవల యూకే వచ్చి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రవాస విద్యార్థులకు సాయం చేస్తోంది. వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడానికి రూపొందించిన  'కేసీఆర్ కూపన్స్' కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. కేసీఆర్‌ కూపన్‌ని ఆవిష్కరించారు నాటి ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి వరకు వెన్నంటే ఉండి
    ప్రోత్సహిస్తూ 'కేసిఆర్ కూపన్స్ ' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ఎన్ఆర్ఐ టీఎస్ఆర్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: