Home /News /telangana /

కేటీఆర్‌కు కవిత రేటింగ్స్, ఒక్క విషయంలో చెప్పని చెల్లెలు

కేటీఆర్‌కు కవిత రేటింగ్స్, ఒక్క విషయంలో చెప్పని చెల్లెలు

కేటీఆర్‌తో సెల్ఫీ తీసుకుంటున్న కవిత (ఫైల్ ఫోటో)

కేటీఆర్‌తో సెల్ఫీ తీసుకుంటున్న కవిత (ఫైల్ ఫోటో)

#AskMPKavitha పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత సమాధానం ఇచ్చారు. ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీపై రియాక్షన్ఇచ్చారు. కేటీఆర్‌కు పలు అంశాల్లో రేటింగ్ ఇచ్చారు.

    టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత మార్కులు ఇచ్చారు. #AskMPKavitha అనే హ్యాష్ ట్యాగ్‌తో నిర్వహించిన సమావేశంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ యువకుడు కేటీఆర్‌కు ఎన్ని మార్కులు ఇస్తారంటూ కొన్ని ప్రశ్నలను సంధించాడు. అందులో ఓ బ్రదర్‌గా కేటీఆర్‌కు పదికి పదిమార్కులు ఇస్తానని కవిత తెలిపారు. ఓ కొడుకుగా కూడా పదికి టెన్ మార్క్స్ వేశారు. ఓ ఫాదర్‌గా ఆయనకు 100 రేటింగ్ ఇచ్చారు కవిత. కేటీఆర్ పిల్లలను చాలా బాగా చూసుకుంటాడని చెప్పారు. అందుకే పదికి వంద మార్కులు ఇచ్చారు. ఓ భర్తగా తన అన్నకు 50 మార్కులు వేశారు కవిత. స్నేహితుడిగా పదికి పది రేటింగ్ ఇచ్చారు.

    అన్ని ప్రశ్నలకు టకాటకా సమాధానం చెప్పిన కవిత.. ఒక్క విషయంలో మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఓ రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఎన్ని పాయింట్లు ఇస్తారని ప్రశ్నించగా, అది తాను చెబితే బాగోదన్నారు. ఇప్పటికే ప్రజలు దాన్ని నిరూపించారని చెప్పారు. ప్రతి సారీ కేటీఆర్‌కు మెజారిటీ పెరుగుతోందని అదే ఆయనకు రేటింగ్ లాంటిదన్నారు.



    పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానం ఇచ్చారు. ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్నించగా, ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని.. అయితే, ఇందిరాగాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో నినాదాన్నే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెబుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. మాటలు చెప్పడం కాకుండా ఆచరణలో చూపాలని ప్రియాంకా గాంధీకి కవిత సూచించారు.

    నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంటలు
    First published:

    Tags: KTR, MP Kavitha, Telangana, Trs

    తదుపరి వార్తలు