సీఎం కేసీఆర్‌పై ఎంపీ డీఎస్ సంచలన వ్యాఖ్యలు... దమ్ముంటే...

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 7:37 PM IST
సీఎం కేసీఆర్‌పై ఎంపీ డీఎస్ సంచలన వ్యాఖ్యలు... దమ్ముంటే...
డి.శ్రీనివాస్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్‌కు దమ్ముంటే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను డీఎస్ ఖండించేందుకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశా. తండ్రి, కొడుకు, కూతురు బాగు పడితే బంగారు తెలంగాణ అయినట్లా?. నా తల్లి చనిపోతే కనీసం ఒక్క మంత్రి, ఎంఎల్ఏ కూడా వచ్చి పరామర్శించలేదు.మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలి. ఆయన నాపై చేసిన విమర్శలు ఖండిస్తున్నా. నేను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే నన్ను ఇప్పటికైనా సస్పెండ్ చేయండి. కొంత మంది ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా నా సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలి. దిగ్విజయ్ సింగ్ నాపై సోనియాకు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్లే మనస్తాపంతో ఆ పార్టీని వీడా.’ అని డీఎస్ అన్నారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు