Home /News /telangana /

AR Rahman Bathukamma Song 2021 -విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత, డైరెక్టర్ గౌతం మీనన్ -ఎట్లుందంటే

AR Rahman Bathukamma Song 2021 -విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత, డైరెక్టర్ గౌతం మీనన్ -ఎట్లుందంటే

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట 2021

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాట 2021

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సారధ్యంలోని తెలంగాణ జాగృతి సంస్థ ఈ ఏడాదికిగానూ సరికొత్త బతుకమ్మ పాటను తీసుకొచ్చింది. లెజెండ్ ఏఆర్ రహమాన్ సర్వరపర్చిన ‘అల్లిపూల వెన్నెల’ పాటను దర్శకుడు గౌతం మీనన్ తో కలిసి కవిత ఇవాళ విడుదల చేశారు..

ఇంకా చదవండి ...
తెలంగాణలో అతిపెద్ద పండు ఒక రోజు ముందే ఆరంభమైంది. బతుకమ్మ సంబురాలకు కొత్త ధ్వనులు సమకూర్చుతూ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట "అల్లిపూల వెన్నెల" గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు.

ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తన నివాసంలో విడుదల చేశారు.



ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు.
అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు "అల్లిపూల వెన్నెల" మరింత శోభను తీసుకొస్తుంది.

అల్లిపూల వెన్నెల పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు. పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు గౌతం మీనన్ “బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు! ’అని తెలుగులో ట్వీట్లు చేశారు. కాగా, అల్లిపూల వెన్నెల వినడానికి క్లాస్ గా ఉండటంతో సాధారణంగా బతుకమ్మ పాటల్లో ధ్వనించే జోష్ మిస్సయిందనే కామెంట్లు వస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bathukamma, Kalvakuntla Kavitha, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు