హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kalvakuntla Kavitha: ఆ చరిత్రకు 8 ఏళ్లు.. నిబద్ధతతో పని చేస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha: ఆ చరిత్రకు 8 ఏళ్లు.. నిబద్ధతతో పని చేస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫోటో)

Kavitha: ప్రజలకు శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న క్రమంలో అనేక మైలురాళ్లను సాధించి ముందుకు వచ్చామని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

  ఎనిమిదేళ్ల ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర సాధన పోరాటంలో విజయం సాధించి చరిత్ర సృష్టించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ప్రతి వ్యక్తికి సేవ చేయడానికి,ముందుకు మార్గాన్ని చూపడానికి నిబద్ధతతో పని చేస్తున్నామని అన్నారు. ప్రజలకు శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న క్రమంలో అనేక మైలురాళ్లను సాధించి ముందుకు వచ్చామని వ్యాఖ్యానించారు. ఇక రాజకీయంగా విపక్షాలను టార్గెట్ చేసే విషయంలో కవిత దూకుడు ప్రదర్శిస్తున్నారు. బహిరంగ సభలు, సమావేశాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. మోదీ దేశంలో ఉంటే ఎలక్షన్‌ మోడ్, విదేశాల్లో ఉంటే ఎరోప్లేన్‌ మోడ్‌ తప్ప మరొకటి ఉండదని వరంగల్ (Warangal District) జిల్లాలో జరిగిన కార్మిక ధర్మయుద్ధం బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

  ప్రధాని ఇలా ఉంటే దేశం ఏమవుతుందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో 44 కార్మిక చట్టాలు రద్దుచేసిన బీజేపీ ప్రభుత్వం, నాలుగు నల్లచట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు.

  కార్మికుల హక్కులను కాలరాసే నల్లచట్టాలను రద్దు కోసం కాజీపేట నుంచే ధర్మయుద్ధం మొదలుపెడదామని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజల్ని కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలని, కార్మికుల చెమట చుక్కల విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని స్పష్టం చేశారు. మోదీ సర్కార్‌ కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా మారిందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలుంటేనే దేశ ప్రజలకు మేలు జరుగుతుందని కవిత తెలిపారు.

  Telangana Formation day: నా తెలంగాణ అంటూ ప్రధాని మోదీ, రాహుల్​ల ట్వీట్స్​.. నెటిజన్లలో ఆసక్తికర చర్చలు

  Revanth reddy: తెలంగాణ పోరాటంలో హోంగార్డు ఉద్యోగం కోల్పోయిన పరమేశ్​ ధీన గాథపై రేవంత్​ స్పందన.. ఏమన్నారంటే..?

  తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భారతీయ యువతను ప్రధాని నరేంద్ర మోదీ మోసగిస్తున్నారని, నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక వెల్లడిస్తోందని కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. 2020కి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఇరాన్‌లో అత్యధికంగా 28.5 శాతం నిరుద్యోగ యువత ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇరాక్, శ్రీలంక, భారత్‌ ఉన్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ఎలా వంచిస్తుందో చూడండి అంటూ కవిత ట్వీట్‌ చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Kalvakuntla Kavitha, Telangana, Trs

  ఉత్తమ కథలు