తెలంగాణ రాజకీయాలను కూడా కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) రిమాండ్ రిపోర్ట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. ఈ రిపోర్టులోనే కవిత(Kalvakuntla Kavitha) పేరు తెరపైకి వచ్చింది. ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ.. ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చినట్టు వెల్లడించింది.
ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఈడీ ప్రస్తావించింది. పది సెల్ఫోన్లను కూడా కవిత డ్యామేజ్ చేసినట్టు ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం 36 మందికి చెందిన 170 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించింది. ఈ రిపోర్ట్‌లో కవిత పేరుతోపాటు వైసీపీ ఎంపీగా ఉన్న లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Srinivasulu Reddy) పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అధికారులు గుర్గావ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. ఈక్రమంలో అదుపులోకి అమిత్ అరోరాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బడ్డీ రిటైల్ ప్రైవేట్ సంస్థ యజమానిగా ఉన్న అమిత్ ఆరోరా ఢిల్లీ లిక్కర్ స్కాంలో లిక్కర్ కంపెనీల నుంచి ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలతో అరెస్టు చేశారు. సీబీఐ, ఆడీ ఎఫ్ఐఆర్లలో 9వ నిందితుడిగా అమిత్ ఆరోరా ఉన్నారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ.. టైసన్కూ నోటీసులు..?
Kavitha Vs Sharmila: షర్మిల బీజేపీ వదిలిన బాణమా..? సీఎం కూతురు వర్సెస్ సీఎం చెల్లెలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసింది. తాజాగా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు ఉండటంతో.. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవితను టార్గెట్ ద్వారా తెలంగాణలోని విపక్షాలు టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉండగా.. వైసీపీ ఎంపీ పేరు తెరపైకి రావడంతో ఏపీలోని అధికార పార్టీని అక్కడి విపక్షాలు టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.