హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..నిందితులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

Big News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..నిందితులకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. నిందితుల బెయిల్ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బెయిల్ పిటీషన్లపై విచారణ ఉన్నందున వాయిదా వేయాలని ప్రతివాదులు కోరారు. ఈ క్రమంలో బెయిల్ పిటీషన పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించి తీర్పు ఇస్తుందని నిందితులు భావించగా..విచారణ వారం రోజుల తర్వాతకు వాయిదా వేయడంతో నిందితులు ఖంగు తిన్నారు. మరి హైకోర్టు నిందితుల బెయిల్ పై ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. నిందితుల బెయిల్ పిటీషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో బెయిల్ పిటీషన్లపై విచారణ ఉన్నందున వాయిదా వేయాలని ప్రతివాదులు కోరారు. ఈ క్రమంలో బెయిల్ పిటీషన పై విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించి తీర్పు ఇస్తుందని నిందితులు భావించగా..విచారణ వారం రోజుల తర్వాతకు వాయిదా వేయడంతో నిందితులు ఖంగు తిన్నారు. మరి హైకోర్టు నిందితుల బెయిల్ పై ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే.

Ys Sharmila: టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగిన YS షర్మిల..కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్

ఇక ఫామ్ హౌజ్ డీల్ కేసుకు సంబంధించి మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకం కానున్నట్లు తెలుస్తుంది. శరత్, ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని అక్కడే పోలీసు కమిషనరేట్ లో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొచ్చిన్ కు చెందిన జగ్గూజి అనే మరో స్వామిజి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తుషార్ కు, జగ్గూజికి మధ్య సంబంధాలపై, అలాగే ఆర్ధిక లావాదేవీలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.  ఇప్పటికే నిందితుల్లో ఒకరైన నందకుమార్ (Nandakumar) హోటల్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు. ఓ వైపు హోటల్ కూల్చివేస్తూనే మరోవైపు సిట్ అధికారులు ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ (Hyderabad) లో సోదాలు జరిపారు. హైదరాబాద్ లో నందకుమార్  (Nandakumar) ఇళ్లలో సోదాలు చేపట్టగా..తిరుపతిలోని సింహయాజి (Simhayaji) ఆశ్రమంలో సిట్ తనిఖీలు చేశారు. ఇక హర్యానా, కర్ణాటకలో రామ చంద్ర భారతి (Rama chandra bharathi) ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి. అలాగే కేరళలో ఓ డాక్టర్ ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఈ డాక్టర్ రామచంద్రభారతికి మధ్యవర్తిత్వంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

Viral News: కళ్లలో రాళ్లు, బియ్యం .. 11ఏళ్ల బాలిక పడుతున్న ఇబ్బంది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక, హర్యానాలో సిట్ సోదాలు ముగియగా కేరళలో మాత్రం రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Supreme Court, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు