హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టులో సిట్ కు షాక్..ఆ ఇద్దరికి ఊరట!

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..హైకోర్టులో సిట్ కు షాక్..ఆ ఇద్దరికి ఊరట!

హైకోర్టులో సిట్ కు షాక్..ఆ ఇద్దరికి ఊరట!

హైకోర్టులో సిట్ కు షాక్..ఆ ఇద్దరికి ఊరట!

TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామిలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటిసులపై సంతోష్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా..డిసెంబర్ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు  (High Court) డిసెంబర్ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి సిట్ లుకౌట్ నోటిసులపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిలో కూడా నోటిసులపై స్టేను హైకోర్టు  (High Court) పొడిగించింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ బయటపెట్టి మరో సంచలనానికి తెర లేపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తో కూడిన సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట లాయర్ ప్రతాప్ గౌడ్ ఉన్నారు.

BJP: తెలంగాణలోని ఆ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు ?.. ఆ ఫలితాల తరువాత

ఇక TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామిలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటిసులపై సంతోష్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా..డిసెంబర్ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు  (High Court) డిసెంబర్ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి సిట్ లుకౌట్ నోటిసులపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిలో కూడా నోటిసులపై స్టేను హైకోర్టు  (High Court) పొడిగించింది.

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్..నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడంటూ..

గతంలో BL సంతోష్ కు రెండుసార్లు నోటీసులు..

ఈ కేసులో BL సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు వస్తాయని సిట్  (Special Investigation Team) భావించింది. అందులో భాగంగా ఈనెల 16న సంతోష్ కార్యాలయానికి నోటీసులు పంపింది. కానీ సంతోష్ ఆ సమయానికి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీనిపై సిట్  (Special Investigation Team)  హైకోర్టును ఆశ్రయించగా కీలక ఆదేశాలు ఇచ్చింది. BL సంతోష్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొంది. ఈ మేరకు సిట్ అధికారులు మెయిల్ ద్వారా BL సంతోష్ కు నోటీసులు పంపించారు. ఈనెల 26న లేదా 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై BL సంతోష్ క్వాష్ పిటీషన్ వేశారు. FIR లో తన పేరు లేనప్పుడు తనకు నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు లాయర్ వాదించాడు.

దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సిట్ నోటీసులపై డిసెంబర్ 5 వరకు స్టే ఇచ్చింది. దీనితో BL సంతోష్ కు ఊరట కలిగింది. ఇక తాజాగా నేడు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు డిసెంబర్ 13 వరకు నోటిసులపై స్టే ఇచ్చింది. మరి నెక్స్ట్ సిట్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  మరి దీనిపై సిట్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇస్తుందా? లేక హైకోర్టు తదుపరి విచారణ వరకు వెయిట్ చేస్తుందా అనేది చూడాలి.

First published:

Tags: Telangana, Telangana High Court, Telangana News, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు