టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ పోలీసులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా..BL సంతోష్ కు ఇచ్చిన నోటిసులపై హైకోర్టు (High Court) స్టే విధించింది. ఇక తాజాగా బండి సంజయ్ అనుచరుడు, కరీంనగర్ అడ్వకేట్ శ్రీనివాస్ కు ఇటీవల సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసుల ప్రకారం శ్రీనివాస్ సిట్ విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే శ్రీనివాస్ ను విచారించిన సిట్ A7గా అతడిని చేరుస్తు మెమోదాఖలు చేసింది. కానీ పోలీసులు నమోదు చేసిన మెమోను ఏసీబీ కోర్టు (Acb Court ) కొట్టివేసింది.
నిన్న అలా..నేడు ఇలా..
ఇక TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామిలకు తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) నిన్న ఊరట లభించింది. ఈ కేసులో వీరిపై సిట్ జారీ చేసిన నోటిసులపై స్టేను డిసెంబర్ 13 వరకు పొడిగించింది. మొదట ఈ నోటిసులపై సంతోష్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా..డిసెంబర్ 5 వరకు నోటిసులపై స్టే విధించింది. దీనితో నేడు విచారణ చేపట్టిన హైకోర్టు (High Court) డిసెంబర్ 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామి సిట్ లుకౌట్ నోటిసులపై హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిలో కూడా నోటిసులపై స్టేను హైకోర్టు (High Court) పొడిగించింది. ఇప్పుడు శ్రీనివాస్ పై మెమో దాఖలును కొట్టివేయడంతో పోలీసులకు చుక్కెదురైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ బయటపెట్టి మరో సంచలనానికి తెర లేపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తో కూడిన సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏపీ, తెలంగాణతో పాటు కేరళ , కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట లాయర్ ప్రతాప్ గౌడ్ ఉన్నారు.
సిట్ కు వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. BL సంతోష్ కు నోటీసులు ఇచ్చే అంశం, శ్రీనివాస్ మెమో దాఖలు కొట్టివేతపై సిట్ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case