హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫుల్ ఖుషీ.. సార్ మీరు సూపరంటూ సంబరాలు.. వివరాలివే..

CM KCR: సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫుల్ ఖుషీ.. సార్ మీరు సూపరంటూ సంబరాలు.. వివరాలివే..

TRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు చేసుకుంటున్నారు. మాకు ఇక ఇబ్బందులు ఉండవంటూ తెగ ఆనంద పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

TRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు చేసుకుంటున్నారు. మాకు ఇక ఇబ్బందులు ఉండవంటూ తెగ ఆనంద పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

TRS Party: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు చేసుకుంటున్నారు. మాకు ఇక ఇబ్బందులు ఉండవంటూ తెగ ఆనంద పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (CM KCR) రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుంది. తన వ్యూహాలతో ఇతర పార్టీల దూకుడుకు ఎప్పటికప్పుడు కళ్లెం వేస్తూ టీఆర్ఎస్ (TRS) పార్టీని రెండు సార్లు ఆయన అధికారంలోకి తీసుకువచ్చారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫుల్ ఖుషీగా మారి పోయారు. మా సార్ నిజంగా సూపరంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం కేసీఆర్ తాజాగా రాష్ట్రంలోని 33 జిల్లాలల టీఆర్ఎస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అయితే.. ఈ అధ్యక్ష పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడ్డారు. ఇందులో గతంలో వివిధ కారణాలతో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ దక్కని వారే అనేకం. పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు సైతం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నాలు సాగించారు. సీఎం కేసీఆర్ కూడా పదవుల సర్దుబాటులో భాగంగా గతంలో టికెట్లు దక్కని వారికి, మాజీ ప్రజా ప్రతినిధులకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగింది.

  అయితే, ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలనే అత్యధిక జిల్లాలకు అధ్యక్షులుగా నియమించారు గులాబీ బాస్. ఇందులోనూ వివాదాలకు దూరంగా ఉండే వారిని ఎరి కోరి ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. దీంతో ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా లేని వారిని ఎంపిక చేస్తే వారు కూడా పవర్ సెంటర్ గా మారి తమకు నియోజవర్గాల్లో ఇబ్బందులు కలిగిస్తారని అనేక మంది భయపడ్డారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వద్ద అనేక మంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. దీంతో ఓ దశలో టీఆర్ఎస్ లో పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది.

  TRS Party: సీఎం కేసీఆర్​ను కలిసిన ఆయా జిల్లాల టీఆర్​ఎస్​ కొత్త అధ్యక్షులు.. మంత్రులు.. లీడర్లతో కళకళలాడిన ప్రగతి భవన్​.. ఫొటోలు మీ కోసమే..

  అయితే.. కేసీఆర్ ఆ ప్రచారానికి తెర దించుతూ ఎవరూ ఊహించకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధ్యక్షులను ఎంపిక చేసి తన ప్రత్యేకతను మరో సారి చాటారు. ఉదాహరణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల ఎంపికను పరిశీలిస్తే.. సూర్యాపేట జిల్లా అధ్యక్ష పదవికి మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను, ఎమ్మెల్సీ కవితను కలిసి తనకు అవకాశం ఇప్పించాలని కోరారు. అయితే.. ఈ నేత గతంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడ్డారు. అయితే.. సామేలుకు టికెట్ ఇస్తే తనకు ఇబ్బందులు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వద్ద మొర పెట్టుకున్నట్లు సమాచారం. నియోజవర్గంలో గ్రూపులు ఏర్పడతాయని.. అలా జరిగితే తనతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుందని ఆయన కేటీఆర్ కు వివరించారట.

  Hyderabad : పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకంటించిన టీఆర్ఎస్..19 ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎమ్మెల్సీలు.. ముగ్గురు ఎంపీలు..

  నల్లగొండ జిల్లా అధ్యక్ష స్థానానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ పడ్డారు. 2018లో ఆయన ఓటమి చెందడంతో కాంగ్రెస్ లో గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ గూటికి చేరిపోయారు. అయితే వీరేశానికి టికెట్ వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని ఆయన కూడా అధిష్టానం వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష స్థానానికి సైతం ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పోటీ పడడంతో ప్రస్తుత ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు ఉన్నాయి. ఆ అంశాలను పరిగణలోకి తీసుకునే సూర్యాపేట జిల్లాకు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జాల్లాకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, భువనగిరి జిల్లాకు కంచర్ల రామకృష్ణారెడ్డి (ఆయిల్ ఫెడ్ చైర్మన్) ను నియమించారు కేసీఆర్. దీంతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.


  ఈ ముగ్గురు కూడా పార్టీకి అత్యంత విధేయులుగా, వివాద రహితులుగా పేరుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపికకు ఇలాంటి వ్యూహమే అవలభించారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా తమ సీటుకు ఢోకా లేదంటూ తెగ సంబర పడిపోతన్నారట. అయితే.. పదవి దగ్గని వారు మాత్రం కొన్ని జిల్లాల్లో పక్క చూపులు చూస్తున్నట్లు సామాచారం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేసీఆర్ కొత్త టీంను తయారు చేసుకుంటున్నారు. అసమ్మతి అనే అంశమే ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  First published:

  Tags: CM KCR, Telangana Politics, Trs, TRS leaders

  ఉత్తమ కథలు