Home /News /telangana /

TRS MLA VIDYASAGAR RAO CONTROVERSIAL STATEMENTS ON DISHA ACCUSED ENCOUNTER AK

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిందితుల ఎన్‌కౌంటర్‌లో కోర్టుల తీరు సరికాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించారు.

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌లో కోర్టుల తీరు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్నదే పోలీసులు చేశారని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. అయితే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టీఆర్‌ఎస్‌లో భిన్నమైన వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలోనే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఈ రకమైన కామెంట్స్ చేయడం గమనార్హం. ఎన్‌కౌంటర్ ఘటన సరికాదని మంత్రి ఈటల రాజేందర్, విప్‌ గొంగిడి సునీత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ దిశ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తల్లిదండ్రులతో సరైన సమన్వయం లేదేమో అని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Disha murder case, Shadnagar encounter, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు