Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    TRS MLS Sanjay Kumar: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

    TRS MLS Sanjay Kumar: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

    news18-telugu
    Updated: October 13, 2020, 3:21 PM IST
    TRS MLS Sanjay Kumar: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
    టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్
    • Share this:
    తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. టీఆర్ఎస్‌కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రెండు రోజులుగా సంజయ్ కుమార్ పలువురు ప్రముఖులను కలిసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను కలిసిన వారికి కూడా కరోనా టెన్షన్ పట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తనను కలిసిన వారు విధిగా పరీక్ష చేయించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. వారంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనను గెలిపించేందుకు నాటి నిజామాబాద్ ఎంపీ కవిత ఎంతగానో శ్రమించారు. అందుకే కవిత ఎంపీగా ఓటమిపాలైన అనంతరం జగిత్యాల నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వీలుగా తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయానికి ఎమ్మెల్యే సంజయ్ సైతం తన వంతు కృషి చేశారు.

    ఇక తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డి కోలుకున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ వైరస్‌ను జయించారు.
    Published by: Kishore Akkaladevi
    First published: October 13, 2020, 3:15 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading