హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నేను రాకముందే ఇదేంటి అంటూ ఫైర్

Telangana: అధికారి కాలర్ పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నేను రాకముందే ఇదేంటి అంటూ ఫైర్

అధికారి కాలర్ పట్టుకున్న కృష్ణమోహన్ రెడ్డి

అధికారి కాలర్ పట్టుకున్న కృష్ణమోహన్ రెడ్డి

TRS MLA KrishnaMohan Reddy: గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను రాకుండానే స్కూల్ ప్రారంభోత్సవం జరగడంపై ఆగ్రహానికి గురైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని పక్కకు నెట్టేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారిపై మండిపడ్డారు. తాను రాకుండా ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏకంగా అధికార కాలర్ పట్టుకుని పక్కకు నెట్టేశారు. గద్వాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను రాకుండానే స్కూల్ ప్రారంభోత్సవం జరగడంపై ఆగ్రహానికి గురైన గద్వాల (Gadwal) ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని పక్కకు నెట్టేశారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. తాను రాకముందే బీసీ గురుకుల పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన ఆయన.. అక్కడే ఉన్న విద్యాశాఖ (Education Department)అధికారి గల్లా పట్టుకుని పక్కకే తోసేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే రాకముందు జడ్పీ చైర్‌పర్సన్ సరిత గురుకుల పాఠశాలను ప్రారంభించడం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కోపానికి కారణమైంది. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల కారణంగానే ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలతో తమను టార్గెట్ చేయడం ఏంటని అధికారులు వాపోతున్నారు.

    గద్వాల ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అంతర్గత వైరం సాగుతోంది. జడ్పీ చైర్‌ పర్సన్ ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన వైరం, జడ్పీ సీఈఓల బదిలీలతో తారాస్థాయికి చేరింది. ఇందులో జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అండదండలు ఉండటంతో, ఆమె గద్వాల ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టు దూసుకుపోతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    అలంపూర్ నియోజకవర్గం, మానవపాడు మండలం జడ్పిటిసిగా ఎన్నికయ్యారు సరిత. అయితే, హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో, సరితకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అదే ఇరువురి నడుమ వైరానికి కారణమైంది. ఎలాగైనా తన వర్గీయులనే జడ్డీ పీఠంపై కూర్చోబెట్టాలని చివరి వరకూ ప్రయత్నించినా ఫలించలేదని అక్కడి నేతలు చెబుతుంటారు.

    Telangana Congress: ఎంపీ కోమటిరెడ్డికి ఊతమిచ్చేలా శశిధర్ రెడ్డి కామెంట్స్.. మళ్లీ మొదలుపెడతారా ?

    Big News: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్..ఏం చెప్పబోతున్నారు?

    గద్వాల ప్రాంతంలో డి.ఆర్.డి.ఏ పి.డిగా పనిచేస్తున్న జ్యోతిని జడ్పీ సీఈఓగా నియమించాలని ఎమ్మెల్యే విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఇది కూడా నెరవేరలేదు. దీంతో రగిలిపోయిన బండ్ల, ఇందుకు నిరసనగా, గన్‌మెన్లను గవర్నమెంట్‌కు సరెండర్ చేసి సంచలనం రేపారు. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే మద్దతు తెలిపిన జ్యోతినే జడ్పీ సీఈఓగా నియమిస్తున్నట్టు రాత్రికి రాత్రే ఉత్తర్వులు వెలువడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య వైరం అంతకంతకూ పెరుగుతూనే వుంది. తాజాగా పరిణామాలు ఇద్దరి మధ్య విభేదాల ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేశాయనే చర్చ జరుగుతోంది.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Telangana, Trs

    ఉత్తమ కథలు