• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TRS MLA BALKA SUMAN INDIRECT SATIRE ON PAWAN KALYAN AND BJP REGARDING GHMC ELECTIONS AK

Telangana: పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు.. పవన్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సెటైర్లు

Telangana: పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు.. పవన్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సెటైర్లు

పవన్ కళ్యాణ్ (File)

GHMC Elections: టికెట్ల కేటాయింపులో టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

  • Share this:
    గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడని విమర్శించారు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడంవిడ్డూరమని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడని ప్రశ్నించారు. విస్తృత ప్రయోజనాల కోసం ఇక్కడ పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రకటన ఎవరికీ అర్థం కావడం లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ సెటైర్ వేశారు. ఆ పార్టీ మాటలు వింటుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

    నేటి నుంచి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు మొదలవుతాయని బాల్క సుమన్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఇంకా సీట్ల పంపకం విషయంలో తలమునకలయ్యాయని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. భవిష్యత్తులోనూ నగరం ప్రశాంతంగా ఉండే బాధ్యతను తాము తీసుకుంటామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల్లో 50 శాతం విద్యావంతులు, 50 శాతం యువకులు ఉన్నారని బాల్క సుమన్ అన్నారు.

    Trs mla balka suman fires on congress and bjp, balka suman lashes out at congress bjp, Kaleswaram project, telangana kaleswaram project, telangana cm kcr, telangana new secretariat, congress, bjp, trs, కాంగ్రెస్ బీజేపీపై బాల్క సుమన్ ఫైర్, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ కొత్త సచివాలయం, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్
    బాల్క సుమన్ (ఫైల్ ఫోటో)


    టికెట్ల కేటాయింపులో టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానన్న బీజేపీ ఎంపీ.. ఆ పని చేశారా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్న కిషన్‌రెడ్డి నిస్సహాయుడని బాల్క సుమన్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి మెజార్టీ సాధిస్తుందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: