హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. ఆ పార్టీ కుట్రలు సాగనివ్వబోమని అన్నారు. నిన్న కమలాపూర్ మండలం దేశరాజపల్లికి చెందిన ఆటో డ్రైవర్ నాగుర్ల రాజేందర్ వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే రాజేందర్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు బాల్క సుమన్‌ది బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అందులో డబ్బులు ఉన్నాయని.. వాటి పోలీసులు మరో వాహనంలో తరలించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారని ఆరోపించారు.
అయితే బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై స్పందించిన బాల్క సుమన్.. రాజేందర్ ఆటోను ఢీకొట్టిన కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మిత్రుడిదని ఆరోపించారు. ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఉప్పల్ రోడ్డుపై బైఠాయించిన ఈటల, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..
Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలని చూస్తున్నారని.. ఈ కారణంగానే టీఆర్ఎస్ నేతలపై బురద జల్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసం ఈటల దంపతులు వారిపై వారే దాడి చేయించుకునే స్థాయికి దిగజారే అవకాశాలున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతో మత చిచ్చు రగిల్చేందుకు బీజేపీ వెనుకాడదని మండిపడ్డారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సుమన్ ఎన్నికల సంఘాన్ని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.